Close

ఆర్ డబ్ల్యూ ఎస్, ఐసిడియస్ శాఖల నిర్మాణ పనులు ప్రగతిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి సమీక్ష.

Publish Date : 23/02/2026

ఏలూరు, ఫిబ్రవరి, 23: జిల్లా కలెక్టరేటు జిల్లా కలెక్టరు ఛాంబరు నుండి సోమవారం జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఆర్ డబ్ల్యూ ఎస్, ఐసిడిఎస్ శాఖలు ద్వారా చేపట్టిన నిర్మాణ పనులు ప్రగతిపై సంబంధిత శాఖలు అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ 45 అంగన్వాడీ కేంద్రాలలో ఆర్ డబ్ల్యూ ఎస్ శాఖ ద్వారా టాయిలెట్లు పనులు, 108 త్రాగునీటి సరఫరా పనులు నిర్దేశించగా ఇంకా 22 టాయిలెట్లు, 44 త్రాగునీటి సరఫరా పనులు, వాటరు ట్యాంకు పనులు ప్రారంభించకపోవడం అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలలో టాయిలెట్లు, త్రాగునీరు సౌకర్యాలు తప్పని సరిగా ఉండాలన్నారు. సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడి సెంటర్లలలో విద్యార్థులు సంఖ్యకు తగిన విధంగా సురక్షిత త్రాగునీటి ఆర్ఓ ప్లాంట్లు, టాయిలెట్లు, మౌలిక సదుపాయాలు ఖచ్చితంగా ఉండాలని అన్నారు.

గూగుల్ మీట్ లో ఆర్ బ్ల్యూఎస్ యస్ఇ జి.త్రినాధ్ బాబు, ఐసిడిఎస్ పిడి పి.శారద, సంబంధిత శాఖల డివిజినల్, మండల స్థాయి అధికారులు, ఇంజనీరింగు అధికారులు పాల్గొన్నారు.