Close

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు “స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా E-Waste Collection (ఈ-వెస్ట్ సేకరణ) కార్యక్రమాన్ని 21-02-2026 (శనివారం) ఉదయం 7:30 గంటలకు స్థానిక 27, 28వ డివిజన్ల పరిధిలోని తంగెళ్ళమూడి-1 సచివాలయం వద్ద, FCI గొడౌన్స్

Publish Date : 21/02/2026

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు “స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా E-Waste Collection (ఈ-వెస్ట్ సేకరణ) కార్యక్రమాన్ని 21-02-2026 (శనివారం) ఉదయం 7:30 గంటలకు స్థానిక 27, 28వ డివిజన్ల పరిధిలోని తంగెళ్ళమూడి-1 సచివాలయం వద్ద, FCI గొడౌన్స్ సమీపంలోని ఏటిగట్టు ప్రాంతంలో నిర్వహించబడుతుంది.
ఈ కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు, గౌరవ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ – ఏలూరు జిల్లా, గౌరవ మేయర్, గౌరవ డిప్యూటీ మేయర్లు, సంబంధిత డివిజన్ల కార్పొరేటర్లు మరియు కో-ఆప్షన్ సభ్యులు పాల్గొననున్నారు.
పర్యావరణ పరిరక్షణ మరియు పరిశుభ్రమైన నగర నిర్మాణం కోసం పాత మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఛార్జర్లు, బ్యాటరీలు, టీవీలు తదితర ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సక్రమంగా సేకరించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం.
కావున, ఈ ప్రజాహిత కార్యక్రమాన్ని ప్రజలకు విస్తృతంగా తెలియజేయుటకు ప్రింట్, డిజిటల్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తప్పనిసరిగా హాజరై సహకరించవలసినదిగా కోరడమైనది. అలాగే నగర ప్రజలందరూ తమ వద్ద ఉన్న ఈ-వెస్ట్‌ను తీసుకువచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి.