ధరఖాస్తులు పరిష్కారంలో నిర్లక్ష్యం, అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు. జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి .
ఏలూరు, ఫిబ్రవరి 16: జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజాసమస్యలు పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లాస్థాయీ అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ, జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్, స్పెషల్ డిప్యూటీ కలెక్టరు యల్.దేవకిదేవి, ఎస్సీ కార్పొరేషన్ ఇడి యం.ముక్కంటి, నగర పాలక సంస్థ కమీషనరు ఏ.భానుప్రతాఫ్, జిల్లా సర్వే సహాయ సంచాలకులు అన్సారీ లు స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రతి సోమవారం పిజిఆర్ఎస్, రెవిన్యూ క్లినిక్ లో అందిన అర్జీలు శాఖలు వారీగా అధికార్లు సత్వరమే పరిష్కారం చేసి, అర్జీ దారులకు బాసటగా నిలవాలన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టి, స్వీకరించిన ప్రతి అర్జీని నిర్ణీత గడువు లోపుగానే నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. అర్జీదారులు సమస్యలు పరిష్కారం చెయ్యుటలో కాలయాపనలు చేయవద్దని, సంతృప్తిచెందేలా సమస్యలు పరిష్కారం ఉండాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో అర్జీదారులతో స్వయంగా మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని, అర్జీలు పునరావృతం కాకుండా నాణ్యతతో పరిష్కరించాలని అన్నారు. భూ సంబంధిత అర్జీలను రెవిన్యూ క్లినిక్ లలో అందజేసి పరిష్కరించు కోవాలన్నారు.
అందిన అర్జీలలో కొన్ని.
ఏలూరు ఆశ్రం కాలేజీ దగ్గర కొత్తకోట శ్రీనివాస చంద్రశేఖర్ మా అబ్బాయి ఒక పబ్లిక్ స్కూల్ లో పదవ తరగతి చదువుకున్నాడు. నాకు అనారోగ్య కారణంగా ఫీజులు చెల్లించలేక పోయాను అందుచేత పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాల్ టికెట్ ఇవ్వడం లేదు, అబ్బాయి భవిషత్తును దృష్టిలో పెట్టుకుని హాల్ టికెట్ ఇప్పించాలని కోరారు, ఆగిరిపల్లి మండలం ఈదులగూడెం చెందిన నాయుడు సీతారాములు రీసర్వేలో నా భూమి సరిగ్గా నమోదుకాలేదు, మరల రీ సర్వే చెయ్యాలని కోరారు, నూజివీడు మండలం మీర్జాపురం గ్రామ నివాసి పుట్టి బలేస్వామి గ్రామ పంచాయతీ రహదారిని ఆక్రమించుకుని, తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తున్నారు విచారణ చేసి సమస్యను పరిష్కారం చెయ్యాలని కోరారు, భీమడోలు మండలం గుండుగోలను గ్రామనివాసి మేజరు గ్రామ పంచాయతీ పెత్తందారీ వీధికి మా స్వంత డబ్బులు వేసుకుని తాత్కాలికంగా రహదారికి గ్రావెల్ వేయించుకున్నామని, శాశ్వత రహదారిని నిర్మించాలని కోరారు, పెదవేగి మండలం కూచింపూడి చెందిన గొల్లపల్లి నాగేశ్వర రావు నా ఆధారు కార్డులో ఇతర విద్యుత్తు సర్వీసులు లింకు అయినందున మా కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏటువంటి సంక్షేమ పథకాలు మంజూరు కావడం లేదని పరిష్కారం చూపాలని కోరారు. రెవిన్యూ క్లినిక్ లు మండలాలు వారీగా ప్రత్యేక కౌంటర్లు ద్వారా స్వీకరించారు. భూసేకరణ సంబంధిత సమస్యలు, ఆర్ఓఆర్ పట్టాదారు పాసుపుస్తకాలు, రీసర్వేలో విస్తీర్ణం తేడాలు, తదితర ఇతర రెవెన్యూ సమస్యలు ఉన్నాయి.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖలు జిల్లా అధికారులు, జిల్లా కలెక్టరేటు ఏవో యన్.వి. నాంచారయ్య, జిల్లా కలెక్టరేటు సూపర్డెంట్లు, తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.