Close

నిరుపేదల హక్కులకోసం పోరాడిన దామోదరం సంజీవయ్య జీవితం ప్రతీ ఒక్కరికీ ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు.

Publish Date : 14/02/2026

ఏలూరు, ఫిబ్రవరి, 14 : నిరుపేదల హక్కులకోసం పోరాడిన దామోదరం సంజీవయ్య జీవితం ప్రతీ ఒక్కరికీ ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతోత్సవాలు సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజాసేవకు కట్టుబడి పనిచేసిన మహానేత అని కొనియాడారు. భారత స్వాతంత్రోద్యమంలో దామోదరం సంజీవయ్య పాత్ర ప్రముఖమైనదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి ఆదర్శప్రాయమని తెలిపారు. సాధారణ కుటుంబం నుంచి దేశ స్థాయికి ఎదిగిన మహోన్నత నాయకుడని, దామోదరం సంజీవయ్య సేవలను స్మరించుకుంటూ వారిని స్ఫూర్తిగా తీసుకొని వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా.ఎమ్.జె. అభిషేక్ గౌడ, డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, సాంఘిక సంక్షేమ శాఖాధికారి విశ్వమోహన్ రెడ్డి, వివిధ షెడ్యూల్డ్ కులాల, తెగల సంక్షేమ సంఘాల నాయకులు, ప్రభృతులు పాల్గొన్నారు.

80