Close

జిలాల్లో ఎస్ఎస్సి., ఇంటర్ పరీక్షలలో ఎక్కడా మాస్ కాపీయింగ్ జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ కి తెలిపారు.

Publish Date : 13/02/2026

ఏలూరు, ఫిబ్రవరి, 13 : జిలాల్లో ఎస్ఎస్సి., ఇంటర్ పరీక్షలలో ఎక్కడా మాస్ కాపీయింగ్ జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ కి తెలిపారు. ఏపీ సచివాలయం నుండి ఎస్ ఎస్సీ,ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు, ప్రభుత్వ సేవలపై ప్రజల సంతృప్తి స్థాయి, కోర్టు భవనాల కోసం స్థలం, కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో స్థల సమస్యలు, తదితర అంశాలపై శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ విజయానంద్ మాట్లాడుతూ ఎస్ఎస్సి., ఇంటర్ పరీక్షల నిర్వహణకు పటిష్టమైన ప్రణాళిక రూపొందించుకుని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడా మాస్ కాపీయింగ్ కి అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు ప్రభుత్వం అందించే సేవలపై ప్రజల సంతృప్తి స్థాయిని మరింత పెంచేలా సేవలందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టిన చర్యలపై జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలియజేస్తూ జిల్లాలో ఈనెల 23వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలు, మార్చ్, 16వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఎస్ఎస్సి పరీక్షల నిర్వహణకు సంబంధిత శాఖల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామన్నారు.

డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, డీఈఓ వెంకటలక్ష్మమ్మ, ఆర్ఐ ఓ యోహాన్, డివిఈఓ టి. శేఖర్ బాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.