ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఆసుపత్రిలో జరుగుతున్న అభివృద్ధి పనుల సమీక్ష
వైద్యం కొరకు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించి వారికి ఆరోగ్య భరోసాను కల్పించే విధంగా వైద్యులు వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, జిల్లా కలెక్టర్ కె వెెట్రీ సెల్వి వైద్యాధికారులకు సూచించారు.
స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ గౌతమీ సమావేశం మందిరంలో శనివారం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో
ప్రభుత్వ ఆసుపత్రిలో అమలు జరుగుతున్న మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనుల పై ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్, జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి, ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి ) తో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ
ప్రభుత్వ ఆసుపత్రికి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా వైద్యాధికారులు వైద్య సిబ్బంది సమన్వయంతో పని చేయాలన్నారు. ముఖ్యంగా గుండె చికిత్సకు సంబంధించి విజయవాడ వంటి ఇతర ప్రాంతాలకు రిఫర్ చేస్తున్నారని, ఏలూరు జిజిహెచ్ లోనే హృదయ చికిత్సకు అవసరమయ్యే ఎక్విప్మెంట్ ను ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారి రఘునందన్ రావుకు సూచించారు. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాలను అందించేందు కు నవభారత్, గోద్రెజ్ వంటి కంపెనీలు దాతృత్వంతో ముందుకు వస్తున్నాయని, వారి. సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. టాయిలెట్స్, శానిటేషన్ ఇతర పనుల రిపేరు కొరకు దాతలు రూ.50 లక్షలు ఇవ్వగా, ఎంపీ ల్యాండ్స్ నుంచి రూ. 50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఎంపీ తెలిపారు. ఆక్సిజన్,వైద్య పరికరాలతో కూడిన అంబులెన్స్ కొనుగోలుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించి వారికి భరోసా కల్పించాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి మాట్లాడుతూ ఆసుపత్రి పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, తాగునీటి సదుపాయాలు, రోగుల కోసం వేచిచోట్ల సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లపై కూడా దృష్టి సారించాలన్నారు..“ప్రజల ఆరోగ్యమే పరమావధిగా వైద్య సేవలు అందించే క్రమంలో ప్రతి వైద్యుడు ప్రజల కోసం పనిచేస్తున్నా మనే భావనతో బాధ్యతగా విధులను నిర్వహించా లన్నారు. ఖాళీగా ఉన్న వైద్యులు, నర్సింగ్ స్టాఫ్ ను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. అవసరం మేరకు కంపార్ట్మెంట్స్ గ్రౌండ్లో సిబ్బందిని తీసుకోవడం జరుగుతుందన్నారు. అగ్నిప్రమాదంలో శరీరం కాలిన రోగులకు చికిత్స వార్డుకు ఏసీలు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ కు సూచించారు. ఆక్సిజన్ కొరత లేకుండా రెడ్ క్రాస్ తో అనుసంధానం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య చంటి మాట్లాడుతూ వైద్యం కొరకు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించి వారి మన్ననలు పొందాలని వైద్యులకు. సూచించారు. బ్లడ్ బ్యాంకు ఎప్పటికప్పుడు పూర్తిస్థాయిలో పనిచేస్తూ, రక్త నిల్వలు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు తక్షణ సేవలు అందించేలా చొరవ చూపాలని, అందులో భాగంగా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. అత్యవసర ఇతరు ప్రాంతాలకు రిఫర్ చేయకుండా ఆసుపత్రిలోనే వైద్య సేవలను అందించే విధంగా వైజాగ్ అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు
ఈ సందర్భంగా అజెండాలో ప్రతిపాదించిన పనులకు కమిటీ ఆమోదం తెలిపింది. ఆప్తాల్మాలజీ విభాగానికి A-స్కాన్ యంత్ర కొనుగోలు,MCH ఆపరేషన్ థియేటర్ కోసం 1(ఒకటి) క్షితిజ సమాంతర ఆటోక్లేవ్ కొనుగోలు, 64 ఫ్యాకల్టీ వైద్యులు భర్తీ,USG స్కాన్లు మరియు మెడికో లీగల్ కేసులకు రెగ్యులర్ రేడియాలజిస్ట్, ధోబీ, ఎలక్ట్రికల్ కేబుల్ ఫిట్టింగ్ పనికి అనుమతి, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU),
అవసరమైన ఫ్యాకల్టీ గదులు, స్పీచ్ థెరపీ గది, ఆడియాలజీ గది, డిసెక్షన్ ల్యాబ్ వివిధ ప్రదేశాలలో దెబ్బతిన్న అంతస్తులు, కిటికీలు, తలుపులు, మరుగుదొడ్ల మరమ్మతులు. అవసరమైన డ్రగ్స్ కొనుగోలు, ఎలక్ట్రోలైట్ అనలైజర్
సెంట్రిఫ్యూజ్, OP రిజిస్ట్రేషన్ కౌంటర్ల కోసం 8 ఎయిర్ కండిషనర్ల కొనుగోలు
మెయిన్ ఓట్ కోసం 2 కొత్త క్షితిజ సమాంతర ఆటోక్లేవ్ ప్రతి ఐసియు అత్యవసర వార్డులకు 10 మానిఫోల్డ్ సిలిండర్ కనెక్టర్లు, ఆల్కహాల్ బ్రీత్ అనలైజర్ కొనుగోలు, యూరిన్ నార్కోటిక్ డ్రగ్స్ స్క్రీనింగ్ టెస్ట్ కిట్లు కొనుగోలుకు ఎజెండాలో ప్రతిపాదించగా కమిటీ ఆమోదించడం జరిగింది.
ఈ సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారి రఘునందనరావు, జి జి హెచ్ సూపరిండెంట్ ఎమ్మెస్ రాజు, డిప్యూటీ సూపరిండెంట్ రవిబాబు, బోధన కళాశాల ప్రిన్సిపల్ పి.సావిత్రి, డీఎంహెచ్వో అమృతం డి సి హెచ్ ఎస్ పాల్ సతీష్ ఇతర వైద్యాధికారులు వైద్య సిబ్బంది, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు