Close

ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన పిజిఆర్ఎస్ కార్యక్రమంలో దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ దెందులూరు నియోజకవర్గంలో ఉపాధి హామీ పథకం ద్వారా 29 కోట్ల రూపాయలతో 110 సిసి, బిటి రోడ్ల నిర్మాణ పనులు మాంజూరు చేయవలసిందిగా కోరుతూ లేఖను అం

Publish Date : 02/03/2026

ఏలూరు, మార్చి, 2: ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన పిజిఆర్ఎస్ కార్యక్రమంలో దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ దెందులూరు నియోజకవర్గంలో ఉపాధి హామీ పథకం ద్వారా 29 కోట్ల రూపాయలతో 110 సిసి, బిటి రోడ్ల నిర్మాణ పనులు మాంజూరు చేయవలసిందిగా కోరుతూ లేఖను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గం లో పలు రోడ్లు అద్వాన పరిస్థితిలో ఉన్నాయని, ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని, వాటిని అత్యవసరంగా నిర్మించవలసి ఉందని కలెక్టర్ ని కోరారు. దెందులూరు మండలంలో 5.96 కోట్ల రూపాయలతో 27 సిసి రోడ్లు, దెందులూరు నియోజకవర్గం పరిధిలోని ఏలూరు రూరల్ మండలంలో 3.09 కోట్ల రూపాయలతో 11 రోడ్లు, పెదపాడు మండలంలో 4.69 కోట్ల రూపాయలతో 14 రోడ్లు, పెదవేగి మండలంలో 15.27 కోట్ల రూపాయలతో 58 రోడ్లు చేపట్టాలని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కలెక్టర్ ని కోరారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రతిపాదించిన పనులను పరిశీలించి నిబంధనల మేరకు తగు చర్యలు తీసుకోవాలని డ్వామా పీడీ సుబ్బారావుని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు.