Close

సేంద్రియ విధానంలో సాగుచేసిన ఉత్పత్తులకు బ్రాండింగు ఇమేజీ మరింత పెంచి రైతులకు బాసటగా నిలవాలి.

Publish Date : 10/04/2026

ఏలూరు, ఏప్రియల్ 10: ఏలూరు జిల్లా సహజ మరియు సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు ప్యాకింగు, బ్రాడింగు, లేబులింగు మరియు సర్టిఫికేషన్ పై శిక్షణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికీ నూటికినూరుశాతం అవగాహన కల్పించి, జిల్లా రైతు సంపదను మార్కెటింగు పెంచేలా సమష్టిగా కృషి చెద్దామని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి పిలుపు నిచ్చారు. స్థానిక జిల్లా కలెక్టరేటు లోని గౌతమీ సమావేశపు హాలులో శుక్రవారం ఏలూరు జిల్లాలో సహజ మరియు సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు ప్యాకింగు, బ్రాడింగు, లేబులింగు మరియు సర్టిఫికేషన్ పై శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి దిశానిర్దేశం చేశారు. సహజ మరియు సేంద్రియ వ్యవసాయ కొన్ని ఉత్పత్తులను నిశితంగా పరిశీలించి, రుచులను చూసి జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి కొన్ని వస్తువులను కొనుగోలు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన ధర లభించేందుకు ఫుడ్ ప్రాసెసింగు యూనిట్ల ద్వారా సాధ్యమని అన్నారు. సేంద్రియ విధానంలో సాగు చేసిన ఉత్పత్తులకు బ్రాండింగు ఇమేజీ మరింత పెంచి రైతులకు బాసటగా నిలిచి, మన ఆరోగ్యాలను కాపాడుకుందామని అన్నారు. ఈ నెల 18వ తేదీ గాని 19వ తేదీగాని ఒక తేదీని ఖరారు చేసి ఏలూరులో రైతు సంపద ఉత్పత్తులు 200 మంది రైతులతో 250 వివిధ రకాలు వస్తువులు ప్రదర్శనతో ఒక మేళా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టరు ఆదేశించారు. ఏలూరు డిసిఎంఎస్ కార్యాలయ ప్రాంగణంలో ఏలూరు రైతుసంపద అమ్మకాలకు ఒక షాపు కేటాయింపుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్యాకింగు, లేబులింగు, బ్రాండింగు, సర్టిఫికేషన్ పై పూర్తి అవగాహన ఉంటే రైతులకు అమ్మకాలు పెరిగి పుష్కలంగా అధిక లాభాలు వస్తాయని అన్నారు. కథలు చెప్పేకన్నా మంచి ఉత్పత్తులు విజయగాధగా వీడియో తీసి పంపాలని, అందరికీ తెలిసేలా పబ్లిష్ చేసి అమ్మకాలను పెంచుతామని, రైతులు వ్యాపార అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందని అన్నారు. సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ప్రజలలో మంచి అవగాహన ఉందని, సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరకన్నా ఎక్కువ ధర లభిస్తున్నదన్నారు. ఏలూరు జిల్లా సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు అమ్మకాలకు ఆన్లైన్ పోర్టల్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అలాగే ఏలూరు జిల్లా ప్రజలు ఆన్లైన్ పోర్టలను పరిశీలించి కావలసిన వస్తువులను కొనుగోలు చేసుకోవాలని, నేను కూడా కావలసిన వస్తువులు కొనుగోలు చేసుకుంటున్నానని అన్నారు. జిల్లాలోని రైతులు సేంద్రియ ఉత్పత్తులైన వంటనూనె, కొబ్బరి నూనె, వంట దినుసులు, హోమ్ మేడ్ చాకొలేట్, బెల్లం ఉత్పత్తులు, ఆహార పొడులు, తదితర ఉత్పత్తులకు ఫుడ్ సేఫ్టీ అధారిటీ ద్వారా అనుమతి తీసుకునే విధానంపై రైతులకు అవగాహన కలిగించి, అనుమతులు వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశం నుండి వెళ్ళే రైతులు తమ ఉత్పత్తులకు ఆన్లైన్ మార్కెటింగు సౌకర్యాలుపై స్పష్టమైన శిక్షణ పొంది పూర్తి అవగాహనతో వెళ్ళేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. దళారీ వ్యవస్థ లేకుండా వినియోగదారులకు నేరుగా రైతులు తమ ఉత్పత్తులు వినియోగించుకునేలా ఆన్లైన్ మార్కెటింగు ఉండేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టరు కార్యాలయంలో జరిగే పిజిఆర్ఎస్, తదితర సమావేశాలకు సహజ మరియు సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు ద్వారా తయారైన స్నాక్స్ ను కొనుగోలు చేసి ప్రోత్సహిస్తామని అన్నారు. ఏలూరు రైతు సంపద ఉత్పత్తులను దూర ప్రాంతాలకు పంపుటకు కార్గో బస్సులు, పారిల్స్ సర్వీసులు సులభతరం చెయ్యాలని ఆర్టీసీ అధికారులను జిల్లా కలెక్టరు ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఏపి ఫుడ్ ప్రాసెసింగు జోనల్ మేనేజరు సి.హెచ్.సాయి శ్రీనివాసు, ఐఐపియం సెంటరు ఇంచార్చి డా.డి.నబీరసూల్, జిల్లా వ్యవసాయ శాఖ జెడి యస్.కె.హబీభ్ భాషా, ఏపి యంఐపి పిడి డా.యస్. రామ్మోహన్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కె.షాజానాయక్,
డిఆర్డిఏ పిడి టి.వి.విజయలక్ష్మి, డిసివో అరిమిల్లి శ్రీనివాసు, ఏపియస్ ఆర్టీసీ జిల్లా ప్రజారవాణా అధికారి యస్.కె.షబ్నమ్, మెప్మా పిడి యం.రాజబాబు, ఫుడ్ సహాయక కంట్రోలరు కె.వెంకటరత్నం, మండల వ్యవసాయ, ఉద్యానవన శాఖా అధికారులు, టెక్నికల్ బృందం సభ్యులు, డ్వాక్రా, మెప్మా, వెలుగు సూపర్వైజర్లు, ఫుడ్ ప్రాసెసింగు యూనిట్లు ప్రతినిధులు, రైతు ఉత్పత్తిదారులు సంఘం సభ్యులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.