పెట్రోల్, డీజిల్ సరఫరాపై రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల వద్ద గట్టి నిఘా పెట్టాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లో వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లాలో డీజిల్ సమస్యపై జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ తో కల
ఏలూరు, ఏప్రిల్, 27 : పెట్రోల్, డీజిల్ సరఫరాపై రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల వద్ద గట్టి నిఘా పెట్టాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లో వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లాలో డీజిల్ సమస్యపై జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ తో కలిసి డివిజినల్, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ ఇతర రాష్ట్రాలకు తరలిపోకుండా చెక్ పోస్ట్ లు ఏర్పాటుచేసి పటిష్టమైన నిఘా పెట్టాలన్నారు. తహసీల్దార్లు, పౌరసరఫరాల శాఖ అధికారులు తమ పరిధిలోని బంక్ లలో పెట్రోల్, డీజిల్ నిల్వలు పూర్తిగా అయిపోకుండా ముందుగానే ట్యాంకర్లు ఇండెంట్ చేసేలా బంక్ యజమానులతో మాట్లాడాలన్నారు. బంక్ ల వద్ద ఎక్కువ రద్దీ లేకుండా చూడాలన్నారు. రబీ ధాన్యం రవాణా చేసే వాహనాలకు, ఆక్వా చెరువుల అవసరాలకు ప్రాధాన్యతను ఇచ్చి డీజిల్ అందిస్తున్నాని, మీ కోసం మేమున్నామని, మీకు ఎటువంటి సమస్య వచ్చినా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామన్న సందేశాన్ని రైతులు, ఆక్వా రైతులకు రైతు సేవా కేంద్రాల సిబ్బంది ద్వారా తెలియజేయాలన్నారు. రైతుల సమస్యలను రైతు సేవ కేంద్రాల సిబ్బంది ద్వారా తెలుసుకుని వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.
జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ, ట్రైనీ కలెక్టర్ సిహెచ్. శ్రవణ్ కుమార్ రెడ్డి, డిఎస్ఓ బాబు విలియమ్స్, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, ప్రభృతులు పాల్గొన్నారు.