పెట్రోల్, డీజిల్ ను అధిక ధరలకు అమ్మితే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి హెచ్చరించారు.
ఏలూరు, ఏప్రిల్, 27 : పెట్రోల్, డీజిల్ ను అధిక ధరలకు అమ్మితే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి హెచ్చరించారు. స్థానిక నరసింహరావుపేటలోని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ పెట్రోల్ బంక్ ను సోమవారం జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ తో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ సోషల్ మీడియా లో వస్తున్న వదంతుల కారణంగానే ప్రజలు ఆందోళనకు లోనై అవసరానికి మించి అధిక మొత్తంలో పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేస్తున్నారని, పెట్రోల్, డీజిల్ కొరత లేదని, అవసరం మేరకు పెట్రోల్, డీజిల్ ఆయిల్ కొనుగోలు చేయాలనీ వినియోగదారులకు సూచించాలన్నారు. బంకు వద్ద రద్దీ లేకుండా చూడాలన్నారు. బంకు లలో రెజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని, ఉదయం నిల్వ, ఆరోజు అమ్మకాలు తదితర వివరాలను నోటీసు బోర్డులో తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. ఈ సందర్భంగా బంక్ లో రికార్డులను కలెక్టర్ పరిశీలించి, బంక్ యజమానిని పెట్రోల్, డీజిల్ నిల్వలను గురించి అడిగి తెలుసుకున్నారు. వాహనదారులను కలిసి పెట్రోల్, డీజిల్ ఎటువంటి కొరత లేదని, ఆందోళనతో అధిక మొత్తంలో కొనుగోలు చేయవద్దని కలెక్టర్ సూచించారు. సోషల్ మీడియా లో వచ్చే వదంతులను నమ్మవద్దని, . జిల్లా ప్రజల అవసరాల మేర పెట్రోల్, డీజిల్ నిల్వలు జిల్లాలో ఉన్నాయని, . అవసరమైన మేర మాత్రమే డీజిల్ కొనుగోలు చేయాలనీ,: డీజిల్ కొరత ఏర్పడుతుందని ఆందోళనతో కొనుగోలు చేయవద్దని వాహనదారులకు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు
జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ వదంతుల కారణంగానే ప్రజలు ఆందోళనకు లోనై అవసరానికి మించి అధిక మొత్తంలో పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేస్తున్నారని, ఆ విషయాన్నీ గమనించి ప్రజలను అవగాహన పరచాలన్నారు.
డి ఎస్ ఓ బాబు విలియమ్స్, తహసీల్దార్ గాయత్రి, రెవిన్యూ , పౌర సరఫరాల శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.