Close

జిల్లాలో డీజిల్ కి ఎటువంటి కొరతా లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. జె. అభిషేక్ గౌడ చెప్పారు. మంగళవారం రాత్రి 7 గంటలవరకు జిల్లాలో 412 కిలోలీటర్లు పెట్రోల్, మరియు 670 కిలోలీటర్లు డీజిల్ అమ్మకం జరిగిందని, అలాగే, కూపన్ విధానం ద్వారా అగ్రికల్చర్, ఫిషరీస్

Publish Date : 28/04/2026

ఏలూరు, ఏప్రిల్, 28 : జిల్లాలో డీజిల్ కి ఎటువంటి కొరతా లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. జె. అభిషేక్ గౌడ చెప్పారు. మంగళవారం రాత్రి 7 గంటలవరకు జిల్లాలో 412 కిలోలీటర్లు పెట్రోల్, మరియు 670 కిలోలీటర్లు డీజిల్ అమ్మకం జరిగిందని, అలాగే, కూపన్ విధానం ద్వారా అగ్రికల్చర్, ఫిషరీస్ మరియు ఎమర్జెన్సీ సర్వీసులకు సుమారు 399 కూపన్ల ద్వారా 15,166 లీటర్ల డీజిల్ సరఫరా చేశామన్నారు. ఇంధన సరఫరాలో ఏవైనా అంతరాయాలు కలిగినచో, లేదా పెట్రోల్ బంకుల వద్ద నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా, కృత్రిమ కొరత సృష్టించినా, వినియోగదారులు వెంటనే కంట్రోల్ రూమ్ 7569296272 ఫోన్ నెంబర్ కు ఫిర్యాదు చేస్తే వెంటనే పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఏలూరులో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న 3 బంక్ లకు షోకాజ్ నోటీసులు: జేసి ఏలూరు నగరంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న 3 పెట్రోల్ బంక్ లకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఇందన సరఫరా పరిస్థితులపై నిర్వహించిన ఉన్నత స్థాయి తనిఖీలలో భాగంగా నాగ హనుమాన్ పెట్రోల్ బంక్, ది ఏలూరు పెట్రోల్ సప్లై కంపెనీ, ఎస్.ఆర్. ప్రీమియం ఫ్యూయల్స్ బంక్ ఆధ్వర్యంలోని ఎంఎస్ (MS) మరియు హెచ్ఎస్టీ (HSD) రిటైల్ అవుట్లెట్ వద్ద నిల్వలు ఉన్నప్పటికీ రిటైల్ అవుట్లెట్ మూసివేయబడినట్లు గుర్తించబడిందని, . ఈ చర్య కారణంగా ప్రజల్లో అనవసర ఆందోళన మరియు ఇందన కొరత పరిస్థితులను సృష్టించే విదంగా ఉన్నందున, సంబందిత 3 పెట్రోల్ బంక్ లకు షోకాజ్ నోటీసు జారీ చేయడం జరిగిందని, మరియు వారి పై కఠిన చర్యలు తీసుకోబడునని జేసీ చెప్పారు. పెట్రోల్, డీజిల్ అక్రమంగా నిల్వ చేయడం, అధిక ధరలకు విక్రయించడం, కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నం చేస్తే సదరు బంక్ ల లైసెన్స్ రద్దు చేస్తామని జేసీ హెచ్చరించారు. జిల్లాలోని పెట్రోల్ బంకులలో పెట్రోల్, డీజిల్ సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అన్ని పెట్రోల్ బంక్ యజమానులు ప్రభుత్వ ఆదేశాలను కచ్చితంగా పాటించి, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇంధన సరఫరాను చేయాలనీ జేసీ అభిషేక్ గౌడ బంక్ యజమానులను ఆదేశించారు. ప్రజలు తమ అవసరాలకు అనుగుణంగా మాత్రమే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని, ఆందోళనతో అనవసరం నిల్వలు చేసుకోవద్దని జేసి విజ్ఞప్తి చేశారు.