జలధార-జలహారతి లో మంజూరైన నీటి పరిరక్షణ పనులు నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జలధార-జలహారతి లో నీటి పరిరక్షణ పనులపై ఇరిగేషన్, డ్వామా అధికారులతో శుక్రవారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీ
ఏలూరు, ఏప్రిల్, 24 : జలధార-జలహారతి లో మంజూరైన నీటి పరిరక్షణ పనులు నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జలధార-జలహారతి లో నీటి పరిరక్షణ పనులపై ఇరిగేషన్, డ్వామా అధికారులతో శుక్రవారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ
జలధార-జలహారతి కార్యక్రమంలో జిల్లాలో ఉపాధి హామీ పధకం ద్వారా 50. 22 కోట్ల రూపాయలతో 879 పనులు గుర్తించడం జరిగిందని, వాటిలో 696 పనులకు పరిపాలనాపరమైన మంజూరు చేయడం జరిగిందన్నారు.వీటిలో 159 పనులు ప్రారంభించడం జరిగిందని, మంజూరైన పనులను 100 రోజుల కార్యాచరణలో భాగంగా మండల, గ్రామాల వారీగా చెరువులలో నీటి నిల్వ సామర్ధ్యం పెంచేందుకు ఫీడర్ చానెల్స్, చెరువులు చేపట్టేందుకు ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోగా పనులు పూర్తిచేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని, పనులు నాణ్యతతో చేపట్టేలా అధికారులు సక్రమంగా పర్యవేక్షించాలన్నారు. పనుల పర్యవేక్షణలో అధికారుల నిర్లక్ష్యం, పనులు నాణ్యతలో లోపాలు గుర్తిస్తే సంబంధిత అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. మంజూరు చేసిన పనులను చేపట్టక ముందు, పనులు పూర్తి ఐన తరవాత విధిగా ఫొటోలతో నివేదిక సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
నిర్దేశించిన లక్ష్యాలలో వెనుకబడిన అధికారులపై చర్యలు-కలెక్టర్ నిర్దేశించిన లక్ష్యాలలో వెనుకబడిన చాట్రాయి, బుట్టాయిగూడెం మండలాల డ్వామా ఏపిఓ లు తమ పనితీరును మెరుగుపరచుకోని పక్షంలో శాఖాపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ హెచ్చరించారు.
ఇరిగేషన్, పంచాయతీ రాజ్ శాఖల ఎస్ఈ లు దేవప్రకాష్, రమేష్, డ్వామా పీడీ సుబ్బారావు, ఇరిగేషన్, పంచాయతీ రాజ్, డ్వామా మండల స్థాయి అధికారులు, మునిసిపల్ కమిషనర్లు, ఎంపిడిఓ లు పాల్గొన్నారు.