18 లోపు బాలలకు సురక్షితమైన బాల్యాన్ని అందించే బాధ్యత మనందరిపై ఉంది. జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ..
ఏలూరు, ఏప్రియల్ 24: జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో శుక్రవారం మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ద్వారా నిర్వహించ బడుతున్న మిషన్ వాత్సల్య పథకపు మొదటి త్రైమాసిక సమన్వయ సమావేశాన్ని జిల్లా బాలల సంరక్షణ సంక్షేమ కమిటీ సభ్యులతో మరియు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారి నివేదికలుపై రివ్యూ సమావేశంకు జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన సంబంధిత అధికారులు సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు
కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ మిషన్ వాత్సల్య ద్వారా 18 సంవత్సరాలు లోపు బాలలకు అందిస్తున్న అన్ని సేవలను సమర్ధవంతంగా అమలు జరపాలన్నారు. ముఖ్యంగా లైసెన్సు పొందకుండా ఏ ఒక్క చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు నిర్వహించ కూడదని స్పష్టం చేశారు. పిల్లలకు ఆశ్రయం కల్పిస్తున్న ప్రతి హోమ్ కూడా జిల్లా కలెక్టరు వారి అనుమతి పొంది ఉండాలని అటువంటి స్వచ్ఛంద సంస్థలను పోలీసు, డిసిపియు మరియు డిపివోల సమన్వయంతో సందర్శించి పూర్తిస్థాయిలో నివేదికలు అందించాలని అన్నారు. అదేవిధంగా దత్తత, పోస్టర్ కేర్ మరియు ఆఫ్టర్ కేర్ అంశాలు పట్ల మరింత అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని అన్నారు. ఊయల కార్యక్రమం మీద ఎక్కువ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.ఏ కారణం చేతనయిన కన్న తల్లిదండ్రులు వద్దనుకుంటున్న పిల్లలను లేదా అన్వెంటెడ్ ప్రెగ్నెన్సీ తో ఉన్న మహిళలు తమకు పుట్టబోయే పిల్లలను చెత్తకుప్పల్లోనూ డ్రైనేజీల్లోనూ పడేయకుండా ఉయ్యాల ప్రధాన ఉద్దేశమని అన్నారు. ఈ ఊయల్లో వేసినచో అటువంటి వారి యొక్క వివరాలను గోప్యంగా ఉంచి ప్రభుత్వం ద్వారా సరెండరు చేసుకుని ఆ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వటానికి దత్తత కార్యక్రమము ఉపయోగ పడుతుందని అన్నారు. అటువంటి పిల్లలను గుర్తిస్తే వెంటనే 1098 టోల్ ఫ్రీ నెంబరుకు కాని డిసిపియు కార్యాలయానికి కాని తెలియ జేయవచ్చునని వారికి ఏ విధమైన చట్టపరమైన విషయములు అడ్డంకి కాకుండా అండగా ఉంటామని తెలియజేశారు. భిక్షాటన చేయు బాలలను, చెత్త వేరుకునే బాలలను గుర్తించి సంబంధిత శాఖలు సమన్వయం చేసుకుని వారిని రక్షించి సంక్షేమ హాస్టల్స్ లో చేర్పించి, అన్ని సౌకర్యాలతో పాటు విద్యాబుద్ధులు నేర్పించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు.
బాలల హక్కులు కాపాడడం మనందరి బాధ్యత బుక్లెట్స్ ను ఆవిష్కరించిన: జిల్లా కె.వెట్రిసెల్వి.
బాలల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టరు పిలుపునిచ్చారు. బాలల హక్కులను రక్షించడము ఫాక్సో చట్టం, బాల్య వివాహ నిషేధచట్టం, దత్తత విధానం గురించి మరియు చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్లు, అందించే సేవలుపై గ్రామీణ ప్రాంతాలలో విస్తృతంగా ప్రచార, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. జిల్లాలో ఎక్కడ బాలల హక్కులు భంగం వాటిల్లకుండా, బాలలను రక్షించే బాధ్యత మనందరిపై ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ మరియు సంక్షేమ కమిటీ సభ్యులు డిఆర్డిఏ పిడి టి.వి.విజయ లక్ష్మి, జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డా.యు.శోభ, ఉమెన్ పోలీసు స్టేషన్ డిఎస్పి యు.రవిచంద్ర, సిఐ యం. సుబ్బారావు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు వెంకటేశ్వర రావు, హైమావతి, రాజేశ్వర రావు, జిల్లా మహిళా శిశుసంక్షేమ సాధికారత అధికారి శ్రీమతి పి.శారద , మిషన్ కోఆర్డినేటరు ఏలూరు తులసి, జిల్లా బాలల సంరక్షణ అధికారి డా. సి.హెచ్ సూర్యచక్రవేణి, డిపిఓ జ్యోతి, మిషన్ వాత్సల్య సిబ్బంది, తదితర శాఖలు అధికారులు పాల్గొన్నారు.