Close

ప్రతి ఒక్కరూ జనగణన సదుపాయాన్ని వినియోగించుకోవాలి. స్వీయ గణనపై క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అవగాహన కలిగించాలి. జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి .

Publish Date : 24/04/2026

ఏలూరు, ఏప్రియల్ 24: ఏలూరు మండలం పోణంగి గ్రామ సచివాలయంలో శుక్రవారం గ్రామ ప్రజలు, రైతులు జనాభా గణన నమోదు కార్యక్రమంలో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి స్వయంగా పరవేక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ సెన్సెస్ పోర్టల్ నందు కుటుంబ యజమానులు వారి స్వీయ వివరములు భారత ప్రభుత్వ వెబ్సైట్ నందు నమోదు చేసుకునుటకు ప్రజలందరికీ అవకాశం కల్పించిందన్నారు. సదరు కార్యక్రమంలో భాగంగా https://se.census.gov.in పోర్టల్ ద్వారా స్వీయ గణన చేసుకోవాలన్నారు. స్వీయ గణన నమోదు పూర్తిగా స్వచ్ఛందమని అన్నారు. జాతీయ స్థాయి కార్యక్రమాన్ని సమర్థవంతంగా, విజయవంతంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు. ఈ నమోదు ప్రక్రియ వల్ల ప్రభుత్వ పథకాలు నిలిచిపోతాయని లేదా ప్రయోజనాలు ఆగిపోతాయనే అనుమానాలు వద్దని స్పష్టం చేశారు. ఇది పూర్తిగా దేశ,రాష్ట్ర అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమమని వివరించారు.

ఈ కార్యక్రమంలో తహశీల్దారు కె.గాయత్రీదేవి, గ్రామ సచివాలయ ఉద్యోగులు, రెవిన్యూ సిబ్బంది, గ్రామ ప్రజలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.