జిల్లా కలెక్టరుతో పాటు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్, జిల్లా జాయింటు కలెక్టరు డా.యం.జె. అభిషేక్ గౌడ పాల్గొన్నారు.
దెందులూరు /ఏలూరు, ఏప్రియల్ 23: రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చెయ్యాలని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. దెందులూరు మండలం గోపన్నపాలెంలో గురువారం ఏర్పాట్లు పరిశీలన అనంతరం శ్రీసీతారామ ప్రభుత్వ వ్యాయామ విద్యాకళాశాల సమావేశ మందిరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్, జిల్లా జాయింటు కలెక్టరు డా.యం.జె.అభిషేక్ గౌడలతో కలిసి జిల్లా అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఈ నెల 25వ తేదీన (శనివారం) దెందులూరు మండలం గోపన్నపాలెంలో పర్యటన సందర్భంగా ఏర్పాట్లను శాఖలు వారీగా కేటాయించిన విధులు అత్యంత బాధ్యతతో నిర్వహించాలని అన్నారు.
ఎక్కడ ఏఒక్క చిన్న పొరపాటుకు తావులేకుండా పగడ్బందీగా ఏర్పాట్లు పూర్తిచెయ్యాలని అన్నారు. గత అనుభవాలను బేరీజు వేసుకుని ఏర్పాట్లును శుక్రవారం సాయంత్రానికి పూర్తిచేసి, పూర్తిస్థాయిలో నివేదికలు సమర్పించాలని అన్నారు.ప్రజావేదికలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించుతారని, దీనితో పాటు పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉందని అన్నారు. ఇతర కార్యక్రమాలకు అనువైన ప్రాంతాలను గుర్తించి, లబ్ధిదారులు గృహాలను ముందుగానే పరిశీలించి సిద్ధం చెయ్యాలని అధికారులకు సూచించారు. ప్రజావేదిక, కార్యకర్తలు సమావేశంనకు అనువైన ప్రాంతాలను గుర్తించి సిద్ధం చేస్తున్నామని తెలిపారు. పర్యటన అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తిచేసి, పర్యటన పూర్తయ్యే వరకు అధికారులకు కేటాయించిన పనులు పూర్తిచేసి, అప్రమత్తంగా విధులు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. వేసవి దృష్ట్యా ఎక్కడ లోటు లేకుండా చల్లటి రక్షిత మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు, అందరికి అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. అన్ని మందులతో మరియు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడిన వైద్యశిబిరాలను ఏర్పాట్లు చేసి, వైద్యాధికారులను, వైద్యసిబ్బంది ఉంచాలని అన్నారు.
జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను పూర్తి చేస్తున్నామన్నారు. హెలిప్యాడ్, లబ్ధిదారులు ముఖ్యమంత్రి స్వయంగా గృహాలకు వెళ్లే ప్రదేశాలను, కాన్వాయ్ మార్గాలను క్షుణ్ణంగా తనిఖీ చేసామని అన్నారు. పర్యటనలో ఏటువంటి అంతరాయం లేకుండా సాఫీగా సాగేందుకు భద్రతా ప్రణాళికలు పటిష్టంగా అమలుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రోడ్డుకు ఇరువైపులా బాంబు డిస్పోజల్ టీమ్, డాగ్ స్క్వాడ్, స్పెషల్ పార్టీ పోలీసులతో మొత్తం దెందులూరు మండలం గోపన్నపాలెం గ్రామం జల్లెడ పడుతున్నామని, ఈ ప్రక్రియ పర్యటన పూర్తయ్యేంత వరకు నిరంతరం ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం ఏఎస్పీ ఆర్.సుస్మిత, ట్రైనీ ఐపీయస్ జయాశర్మ, ఏలూరు ఇంచార్చి ఆర్డీవో ఐ.కిషోరు, వివిధ శాఖలు జిల్లా, మండల అధికారులు, కళాశాల ప్రిన్సిపాల్ డా.యస్. నత్తానియేలు,తదితరులు పాల్గొన్నారు.