దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రతినిధులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ..
దెందులూరు/ ఏలూరు, ఏప్రియల్ 23: దెందులూరు మండలం గోపన్నపాలెం గ్రామంలో గురువారం శ్రీసీతారామ ప్రభుత్వ వ్యాయామ విద్యాకళాశాల గ్రౌండు, సోమరపాడు కాలనీ, పిఇటి గ్రౌండు, గాలయిగూడెం, తదితర ప్రాంతాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ శనివారం ముఖ్యమంత్రి దెందులూరు మండలం గోపన్నపాలెం గ్రామంలో పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. జనాభా నిర్వహణ -ప్రతిపాదిత గ్రామసభ కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి, అంగన్‌వాడీ కార్యకర్తలు, కొందరు గర్భిణీస్త్రీలతో పోషణ మరియు ఇతర మహిళా శిశుఅభివృద్ధి సంబంధిత సేవలుపై సంభాషణ ఉంటుందని అన్నారు. గ్రామ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, ఆశా కార్యకర్త, ఏఎన్ఎం, ఎంఎల్‌హెచ్‌పి, వైద్య అధికారి, కొందరు గర్భిణీ స్త్రీలు మరియు అర్హులైన దంపతులతో ఏఎన్‌సీ సేవలు, స్టెరిలైజేషన్ మరియు ఇతర ఆరోగ్య శాఖ సేవలుపై సంభాషణ ఉంటుందని చెప్పారు. లబ్ధిదారులు మూడు ఇండ్లకు స్వయంగా వెళ్ళి, వాళ్ళ కష్టసుఖాలను తెలుసుకుంటారని అన్నారు.ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి సెంటరు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించే అవకాశం ఉందన్నారు.ప్రజా వేదిక పక్కన ఉన్న స్టాల్స్ మరియు వైద్య శిబిరాన్ని సందర్శన చేసి, ప్రజా వేదికలో పాల్గొంటారని అన్నారు.
దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ మా నియోజక వర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మా నియోజకవర్గ ప్రజలు 25వ తేదీ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారని, నియోజకవర్గ ప్రజలు ముఖ్యమంత్రికి స్వాగతం చెప్పుటకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.
జిల్లా కలెక్టరు వెంట జిల్లా జాయింటు కలెక్టరు డా.యం.జె. అభిషేక్ గౌడ, జంగారెడ్డిగూడెం ఏఎస్పీ ఆర్. సుస్మిత, ట్రైనీ ఐపీయస్ జయాశర్మ, ఆర్డీవో ఐ.కిషోరు, వివిధ శాఖలు జిల్లా, మండల అధికారులు, ఏలూరు ఉడా చైర్మన్ పెద్దిబోయిన వాణి శివప్రసాదు, ఏయంసి చైర్మన్ గారపాటి రామసీత, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.