Close

పట్టణంలో పలు ప్రాంతాల్లో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె.శివ ప్రతాప్ కిషోర్ సంయుక్తంగా పలుప్రమాద ప్రదేశాలను పరిశీలించి, సంబంధిత అధికారులకు దిశానిర్దేశం

Publish Date : 22/04/2026

ఏలూరు, ఏప్రియల్ 22: స్థానిక జూట్ మిల్లు, పాత బస్టాండు, ఆశ్రమం బైపాస్ రోడ్డును, తదితర ప్రాంతాలను బుధవారం జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె.శివ ప్రతాప్ కిషోర్ సంయుక్తంగా సంబంధిత అధికారులతో పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రధాన రహదారులు, ట్రాఫిక్ జంక్షన్లు, ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను స్వయంగా తనిఖీ చేసి, సమస్యలను గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. రోడ్లపై స్పీడు బ్రేకర్స్ నియంత్రణ, ట్రాఫిక్ నియమాల కఠిన అమలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు, సోలార్ సిగ్నల్ వ్యవస్థలను మెరుగుదల, రోడ్లు వెడల్పులు, తదితర వంటి అంశాలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.

జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ ప్రజలు ప్రాణ రక్షణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతగల అంశమని తెలిపారు. ప్రమాదాలను తగ్గించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ నియమాలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగం తప్పనిసరి చేయడంతో పాటు మద్యం సేవించి వాహనం నడిపే వారిపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం ఏఎస్పి ఆర్. సుస్మిత, ట్రైనీ ఐపీయస్ జయాశర్మ, వివిధ శాఖలు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.