Close

ఇండ్ల జాబితా, గణన కు వచ్చే ఎన్యూమరేటర్లు సమాచారం అందించి సహకరించండి జనగణన – మన అందరి బాధ్యత, మన అందరి భవిష్యత్తు- జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

Publish Date : 30/04/2026

ఏలూరు, ఏప్రిల్, 30 : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏలూరు జిల్లాలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన కార్యక్రమం మే 1 నుండి మే 30 వరకు నిర్వహించడం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. . ఈ సందర్భంగా ప్రభుత్వ నియమించిన ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వచ్చి ఇండ్ల జాబితా మరియు గణన వివరాలను నమోదు చేస్తారని, వారికి పూర్తి సహకారం అందించి, మీ యొక్క వివరాలు, ఇళ్ల వివరాలను ఎన్యుమరేటర్లకు నమోదు చేయించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే స్వీయ గణన (Self-Enumeration) పూర్తి చేసిన వారు, ఎన్యుమరేటర్లు మీ ఇంటి వద్దకు వచ్చినప్పుడు స్వీయ గణన ఐడీని చూపించి మీ యొక్క వివరాలను ధృవీకరించుకోవాలన్నారు. మీ యొక్క ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన వివరాలను నమోదు చేయు విషయంలో సందేహములు ఉంటే మండల, రెవిన్యూ డివిజన్ మరియు జిల్లా స్థాయిలలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడమైనదని, లేదా జిల్లా కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్: 18002331077 మరియు ఫోన్ నెంబర్: 9491041419 ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చన్నారు. జనగణన – మన అందరి బాధ్యత, మన అందరి భవిష్యత్తు అని, ఏలూరు జిల్లా ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని, మీ యొక్క ఇండ్ల జాబితా మరియు గణన వివరాలను తప్పక నమోదు చేయించుకోవలసిందిగా కలెక్టర్ వెట్రిసెల్వి కోరారు.