Close

వర్షం ద్వారా కురిసే ప్రతినీటి చుక్కను సంరక్షించుకోవడం “జలధార – జలహారతి” కార్యక్రమం ముఖ్యఉద్దేశం జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి .

Publish Date : 30/04/2026

ఏలూరు/నూజివీడు, ఏప్రియల్ 30: నూజివీడు మండలం పల్లెర్లమోడీ, యంయన్ పాలెం, తుక్కులూరు, తదితర గ్రామాల్లో గురువారం జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా జలధార – జలహారతి కార్యక్రమాలు పనులను సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పనులు ద్వారా వర్షం ద్వారా కురిసే ప్రతినీటి చుక్కను సంరక్షించుకోవడం జలధార – జలహారతి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 100 రోజులు యాక్షన్ ప్లాన్ అనుగుణంగా జిల్లాలో పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా రూ 150 కోట్లు కేటాయించి అందుకు అనుగుణంగా పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు. నూజివీడు మండలంలో 302 పనులు గాను రూ 12 కోట్లు కేటాయించామని అన్నారు. చేసే పనులు నాణ్యతా ప్రమాణాలు పాటించి, వేగవంతం చెయ్యాలని అన్నారు. జాతీయ ఉపాధి హామీ పనులు ద్వారా చెరువులు, ఫీడర్సు చానల్స్, తదితర గుర్తించి పనులు వేగవంతం చెయ్యాలని అన్నారు. ఉపాధి శ్రామికులకు ఇబ్బందిగా ఉన్న పనులను యంత్రాల ద్వారా చెయ్యుటకు చర్యలు తీసుకోవాలని అన్నారు. చెరువులో పేరుకు పోయిన మట్టిని తొలగించడం ద్వారా నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని, దీని వల్ల భవిష్యత్తులో త్రాగునీటి, సాగునీటి అవసరాలు తీర్చడంలో సహకారం లభించడమే కాకుండా భూగర్భజలాలు స్థాయి కూడా మెరుగుపడుతుందని అధికారులు వివరించారు. ఈ చర్యలుపై స్థానిక ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తూ తమకు త్రాగునీటి, వ్యవసాయ అవసరాలకు పరిస్థితులు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ ఉపాధి హామీపథకం గ్రామీణ ప్రాంతాలు ఆర్థిక స్థితిని బలోపేతం చేసే ముఖ్యమైన సాధనమని తెలిపారు. గ్రామీణ కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ జీవనోపాధిని మెరుగుపరచు కోవాలని సూచించారు. గ్రామీణ ఉపాధి హామీ శ్రామికులకు మంచి ప్రోత్సాహం లభిస్తుందని, పనులు కోసం దూర ప్రాంతాలకు వెళ్ళే అవసరం ఉన్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన సమయం లోగా పనులు పూర్తిచేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని, పనులు నాణ్యతతో చేపట్టేలా అధికారులు సక్రమంగా పర్యవేక్షించాలన్నారు. పనులు పర్యవేక్షణలో అధికారుల నిర్లక్ష్యం, పనులు నాణ్యతలో లోపాలు గుర్తిస్తే సంబంధిత అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పని జిల్లా కలెక్టరు హెచ్చరించారు. మంజూరు చేసిన పనులను చేపట్టక ముందు, పనులు పూర్తి అయిన తరవాత విధిగా ఫొటోలతో నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టరు బొల్లిపల్లి వినూత్న, అసిస్టెంటు కలెక్టరు సి.హెచ్.శ్రావణ్ కుమార్ రెడ్డి, డ్వామా పిడి కె.వెంకట సుబ్బారావు, ఇరిగేషన్ శాఖ డిఈ అర్జున్ రావు, వివిధ శాఖలు అధికారులు, జాతీయ ఉపాధి హామీ ఉద్యోగులు, టెక్నికల్ సిబ్బంది, స్థానిక రైతులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.