ధాన్యం కొనుగోలులో ఏదైనా సమస్య ఎదురైతే టోల్ ఫ్రీ 18004256453 నెంబర్ కి లేదా హెల్ప్ డెస్క్ నెంబర్ -7702003584 కి ఫోన్ చేసి పరిష్కారం పొందవచ్చు
ఏలూరు, ఏప్రిల్, 30 : ఏలూరు జిల్లాలో ప్రస్తుత రబీ లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ చేస్తున్నామని, 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యానికి గాను ఇంతవరకు 1,54,386 టన్నుల ధాన్యాన్ని సేకరించామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ చెప్పారు. ధాన్యం సేకరణకు గాను 128 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశామని, . ఇంతవరకు 103 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 1,54,386 టన్నుల ధాన్యాన్ని రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సేకరించామన్నారు. 58 లక్షల గొనె సంచులను రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. ఉంగుటూరు మండలం లో 53,485 మెట్రిక్ టన్నుల ధాన్యమును మరియు నారాయణపురం & 2 కొనుగోలు కేంద్రాల ద్వారా 3745 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ఉంగుటూరు మండలంలో 157 వాహనాలను రిజిస్ట్రేషన్ చేసి మరియు 16,93,747 గోనె సంచులు అందుబాటులో ఉంచడం జరిగిందని, రైతుల యొక్క ధాన్యమును బద్రపరుచుటకు 325 టార్పాలిన్లు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. అకాల వర్షాల నుండి ధాన్యాన్ని రక్షించేందుకు జిల్లాలోని అన్ని రైతుసేవా కేంద్రాల వద్ద రైతుల కోసం టార్పాలిన్లు అందుబాటులో ఉంచామన్నారు. హమాలీలు, వాహనాలను, గోనె సంచులు కూడా రైతులు వారి సొంతం గా ఏర్పాటు చేసుకున్నట్లైతే గోనె సంచుల కోసం వినియోగ రుసుము 4.47/- హమాలీల కొరకు 24.06 వాహనాల ఏర్పాటు కొరకు ప్రభుత్వ నిబంధనల మేరకు చెల్లించడం జరుగుతుందన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి వాహనాలు, గోనె సంచులు, వంటి ఏమైనా సమస్యలు, సందేహాలు ఉన్నచో టోల్ ఫ్రీ 18004256453 నెంబర్ కి లేదా హెల్ప్ డెస్క్ నెంబర్ -7702003584. నంబర్లకు ఫిర్యాదు చేసినచో వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని మూర్తి తెలియజేసారు.