Close

ద్వారకా తిరుమల ఆలయంలో 29 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

Publish Date : 09/05/2026

ఏలూరు, ద్వారకా తిరుమల, 9: ద్వారకాతిరుమల ఆలయంలో శనివారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి 29 కోట్ల రూపాయలతో పలు కార్యక్రమాలను ప్రారంభించారు. . ముందుగా భక్తుల సౌకర్యాయార్థం రూ. 12. 50 కోట్ల రూపాయలతో నిర్మించిన క్యూ కాంప్లెక్స్ ను ప్రారంభించారు. క్యూ లైన్లో ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. అనంతరం 12 కోట్ల రూపాయలతో నిర్మించిన అనివిట్టి మండపాన్ని ప్రారంభించారు. విశాలమైన మండపం, అందులోని శిల్పాకృతులను మంత్రి పరిశీలించి ఆలయ అధికారులను అభినందించారు. ఈ సందర్భంగా ఆలయ విస్తీర్ణం, ఆలయంలో ఉపాలయాలు, ఆలయం మ్యాప్, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా ఆలయ ఈఓ వేండ్ర త్రినాధరావు మంత్రికి వివరించారు. సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా త్వరితగతిన దర్శనం కలిగేలా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా వేసవి దృష్ట్యా దర్శనం కోసం క్యూ లైన్లలో వేచిఉండే భక్తులకు త్రాగునీరు, మజ్జిగ వంటివి అందించాలని, ఎండ తీవ్రతకు ఎవరైనా గురైతే వెంటనే చికిత్స అందించేలా ఆలయ ఆవరణలో మెడికల్ క్యాంపు నిర్వహించాలని మంత్రి ఆలయ అధికారులను ఆదేశించారు. అనంతరం కొండపైన శివాలయంలో 4. 50 కోట్ల రూపాయలతో నిర్మించిన 5 అంతస్తుల రాజగోపురాన్ని మంత్రి ప్రారంభించారు. శివాలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు.

మంత్రి వెంట గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడ, వంశ పారంపర్య ధర్మకర్త మండలి చైర్మన్ రాజా సూరానేని వెంకట సుధాకరరావు, అనువంశిక ధర్మకర్త సూరానేని నివృతిరావు, ప్రధానార్చకులు పి .వి.ఎస్.ఎస్.ఆర్.జె. ఆచార్యులు, దేవాదాయ శాఖ సంయుక్త కమీషనరు ఆలయ ఈఓ వేండ్ర త్రినాధరావు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి రామకృష్ణ, డిఎస్పీ శ్రావణ్ కుమార్, దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు సిహెచ్. హనుమంతరావు, వై. శ్రీనివాసరావు సిహెచ్. శివకృష్ణ బ్రహ్మయ్య, పి . శ్రీనివాసరెడ్డి, ఏ . సత్యనారాయణ, కె. సురేష్ కుమార్, ఏ . సత్యనారాయణ, పి . వెంకటచారిత, కె. సత్యవతి, యూ.కె. సుహాసిని, హెచ్. వీరభద్రరావు, కె. కళావతి, సిహెచ్.సుశీల, కె. నాగసీత, బి. ప్రమీల, కె. మధులత, దేవాదాయ శాఖ అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఆలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.