జలధార-జలహారతిలో మంజూరు చేసిన 2250 పనులను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలి జలధార-జలహారతి పనుల ప్రగతిపై అధికారులతో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి జూమ్ కాన్ఫరెన్స్
ఏలూరు, మే, 16 : జిల్లాలో జలధార-జలహారతి కార్యక్రమంలో మంజూరు చేసిన 2250 పనులు నిర్దేశించిన సమయంలోగా పనులను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి జలధార-జలహారతి కార్యక్రమంపై శనివారం అధికారులతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జలధార-జలహారతి కార్యక్రమంలో ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేసేలా ఎంపిడిఓలు చర్యలు తీసుకోవాలన్నారు. చేపట్టిన పనులు తప్పనిసరిగా పూర్తి నాణ్యతతో ఉండేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. ఆమోదించిన పనుల వివరాలు, పనుల పురోగతి ని ఎప్పటికప్పుడు ఆన్లైన్ యాప్ లో తప్పనిసరిగా నమోదుచేయాలన్నారు. జలధార-జలహారతిలో 2250 పనుల పూర్తి వివరాలు ఆన్లైన్ లో నమోదు చేయాలన్నారు. జలధార-జలహారతి కార్యక్రమం మంజూరై ఇంకా ప్రారంభం కానీ పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. అదేవిధంగా జిల్లాలో 1530 మైనర్ ఇరిగేషన్ చెరువుల అభివృద్ధి పనులను కూడా నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేయాలన్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను అధికారులు తప్పనిసరిగా పరిశీలించి, పనులు చేపట్టకముందు, చేపట్టిన తరవాత ఫొటోలతో పాటు వివరాలను ఆన్లైన్ లో పొందుపరచాలన్నారు.
డ్వామా పీడీ కె. సుబ్బారావు, ఇరిగేషన్, పంచాయతీ రాజ్ శాఖల ఎస్ఈ లు దేవప్రకాష్, రమేష్, ఎంపిడిఓలు, డ్వామా, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖల డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.