Close

జిల్లాలో జల్ జీవన్ మిషన్ 2.0 , స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) కార్యక్రమాలను నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతి లాల్ దండే కు తెలిపారు.

Publish Date : 20/05/2026

ఏలూరు, మే, 20 : జిల్లాలో జల్ జీవన్ మిషన్ 2.0 , స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) కార్యక్రమాలను నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతి లాల్ దండే కు తెలిపారు. జల్ జీవన్ మిషన్ 2.0 , స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) కార్యక్రమాల అమలుపై జిల్లా కలెక్టర్లు, ఆర్ డబ్ల్యూ ఎస్ ఇంజనీరింగ్ అధికారులతో బుధవారం స్పెషల్ సీఎస్ కాంతి లాల్ దండే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కాంతి లాల్ దండే మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ పనులను వేగవంతం చేసి, పూర్తి చేసిన పథకాలను గ్రామ పంచాయతీలకు అప్పగించే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లాలో DWSM సమావేశాలు నెలనెలా నిర్వహించి, సమావేశ నిర్ణయాలను eJalShakti పోర్టల్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని సూచించారు. డిస్ట్రిక్ట్ టెక్నికల్ యూనిట్స్ (DTU), విలేజ్ వాటర్ సెక్యూరిటీ ప్లాన్స్ (VWSP), నల్ జల్ మిత్ర కార్యక్రమాల అమలులో జిల్లాల పనితీరును సమీక్షించి, నిర్దేశిత లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.. హర్ ఘర్ జల్ ధృవీకరణ, పథకాల పూర్తి స్థితి, జల్ అర్పణ, జల్ సేవా ఆంకలన్ కార్యక్రమాలు, సుజలం భారత్ ఐడీలు అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.

జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ 2.0 కింద గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీటి సరఫరా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, , పీఎం JANMAN మరియు DAJGUA గ్రామాలకు ప్రాధాన్యతనిస్తూ తాగునీటి కనెక్షన్ల అందిస్తున్నామన్నారు. నీటి నాణ్యత పర్యవేక్షణ, గ్రామస్థాయి FTK పరీక్షలు, స్కూల్స్ మరియు ఆంగన్‌వాడీ కేంద్రాల్లో తాగునీటి సదుపాయాల నిర్వహణ, ఘన వ్యర్థాల నిర్వహణ పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామని, , గ్రామీణ పారిశుద్ధ్య కార్యక్రమాల పురోగతిని ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షించి సంపూర్ణ పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా చూస్తున్నామన్నారు.
సమావేశంలో ఆర్ డబ్ల్యూ ఎస్ సూపెరింటెండింగ్ ఇంజనీర్, ప్రభృతులు పాల్గొన్నారు.