జూన్ 15వ తేదీ నుంచి ఓటర్లు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలి. జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ..
ఏలూరు, మే 19: జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో మంగళవారం జూన్ 15వ తేదీ నుంచి ఓటర్లు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని విజయవంతంపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం ప్రారంభకానున్నది అని అన్నారు. జూన్ 15వ తేదీ నుండి జూలై 14వ తేదీ వరకు నిర్వహించే ఇంటింటా సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు. జూలై 21వ తేదీన ముసాయిదా ఓటరు జాబితా విడుదల అవుతుందని తెలిపారు. తదుపరి అభ్యంతర సేకరణ కార్యక్రమం జూన్ 21వ తేదీ నుండి ఆగస్టు 20వ తేదీ వరకు నిర్వహించాలని అన్నారు. అనంతరం సెప్టెంబరు 22వ తేదీన తుది ఓటర్లు జాబితా విడుదల చేస్తారని తెలిపారు. జూన్ నుండి సెప్టెంబర్ వరకు నిర్వహించే ప్రత్యేక విస్తృత పునశ్చరణ (SIR ) ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ అత్యంత కీలకంమని అన్నారు. ఇందుకు సంబంధించి ఇఆర్వోస్, ఏఇఆర్వోస్, బూత్ లెవెల్ అధికార్లు, సూపర్వైజర్లు, తదితరులకు జూన్ 05 వ తేదీ నుండి జూన్ 10వ తేదీ వరకు ఏర్పాట్లు, శిక్షణ, ముద్రణ కార్యక్రమాలు సమర్థవంతంగా పూర్తిచేయాలని ఆదేశించారు. జూన్ 10వ తేదీ నుండి జూన్ 13వ తేదీ వరకూ బూత్ లెవల్ ఏజెంట్లకు ఓరియంటేషన్ వర్కు షాప్లు ఇఆర్వోస్ నిర్వహించాలని ఆదేశించారు. 1200 మంది ఓటర్లు దాటిన పోలింగు బూతులను వివిధ రాజకీయ పార్టీప్రతినిదులు సమావేశంలో చర్చించి, క్రొత్త పోలింగు స్టేషనులకు ప్రతిపాదనలను పంపించాలని అన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమానికి ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. జిల్లాలో జనగణన కార్యక్రమంలో భాగంగా ఇండ్లగణనను పూర్తి చెయ్యాలని అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై ఈనెల 25వ తేదీలోగా జిల్లా స్థాయిలో హెల్ప్ డెస్క్ ఏర్పాటుచేయాలని, ఖాళీగా ఉన్న సూపర్వైజర్లు, బి.ఎల్.వో పోస్టులు వివరాలుపై నివేదికను వెంటనే సమర్పించాలన్నారు.
ఈ సమావేశంలో ఇంచార్చి జిల్లా రెవెన్యూ అధికారి యల్.దేవకీదేవి, ఇంచార్జి ఆర్డీవో ఐ.కిషోరు, జెడ్పీ సిఈవో పి.జగదాంబ, ఏపి ఐఐసి జోనల్ మేనేజరు కె.బాబ్జీ, తహశీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.