Close

పిజిఆర్ఎస్, రెవిన్యూ క్లినిక్ లలో వచ్చిన అర్జీలు 274 జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ

Publish Date : 25/05/2026

ఏలూరు, మే, 25 : ప్రజాసమస్యల పరిష్కార వేదికలో అందిన ప్రతీ సమస్యను పరిష్కరించే దిశగా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ హాలులో సోమవారం జిల్లా స్థాయి ప్రజాసమస్యలు పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లాస్థాయీ అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టరు అభిషేక్ గౌడ నిర్వహించారు. జాయింట్ కలెక్టరుతో పాటు ఇంచార్జ్ డిఆర్ఓ దేవకీదేవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టరు కె.భాస్కర్, ఎస్సీ కార్పొరేషన్ ఇడి యం.ముక్కంటిలు అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా జేసీ అభిషేక్ గౌడ మాట్లాడుతూ పిజిఆర్ఎస్ లో అందిన ప్రతీ అర్జీని క్షుణ్ణంగా అధ్యయనం చేసి, క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత సమయంగాలో పరిష్కరించాలన్నారు. సోమవారం పిజిఆర్ఎస్, రెవిన్యూ క్లినిక్ లలో 274 అర్జీలు అందాయని, అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటానని జేసీ హెచ్చరించారు. ప్రజల నుండి అందిన అర్జీలకు సంబంధించి సంబంధిత అధికారులతో మాట్లాడి వాటిని వెంటనే పరిష్కరించాలని జెసి ఆదేశించారు.

వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.