Close

జిల్లా స్థాయిలో పరిష్కారం అయ్యే సమస్యలను అధికారులతో సమీక్షించి పరిష్కారంకు కృషిచేస్తాం జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి .

Publish Date : 25/05/2026

ఏలూరు/కైకలూరు, మే 25: కైకలూరు తహశీల్దారు చాంబర్లో సోమవారం సంబంధిత శాఖలు అధికారులు, చేపలు, రొయ్యలు సాగు రైతులతో జిల్లా కలెక్టరు
జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో రొయ్యలు, చేపలు సాగు చేస్తూ ఎదుర్కొంటున్న పలు సమస్యలను జిల్లా కలెక్టరుకు రైతులు వివరించారు. చెరువులకు సరిపడా విద్యుత్తు సరఫరా లేకపోవడం, విద్యుత్తు సబ్సిడీని ఇవ్వాలని, మేత ధరలు అధికంగా పెరగడం వ్యాధులు ప్రభావంతో దిగుబడులు తగ్గిపోవడం, నీటి కాలుష్యం వంటి సమస్యలు వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు తెలిపారు. యుద్ధప్రభావం వలన ప్రతి వస్తువు ధరలు విపరీతంగా పెరిగాయని, మేము సాగుచేసిన పంటలు ధరలు విపరీతంగా తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి తగిన సబ్సిడీలు, నాణ్యమైన మేత అందుబాటులోకి తీసుకురావడం, విద్యుత్తును సరఫరాను మెరుగుపరచడం, చెరువులు ప్రాంతాల్లో నీటి నాణ్యతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రైతులు కలెక్టరును కోరారు. దేశంలో అన్ని రాష్ట్రాలకు చేప పిల్లలను ఎగుమతి చేస్తూ కైకలూరు మొదటి స్థానంలో నిలిచిందని అన్నారు. జూన్ -జూలై మాసాల్లో నీటి కొరత లేకుండా చూడాలని కోరారు. అలాగే రొయ్యలు, చేపలు సాగుకు సంబంధించి బ్యాంకు రుణాలుపై సడలింపులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రైతులు సమస్యలను సంబంధిత శాఖాధికారులతో సమన్వయం చేసి సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మిగిలిన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కారానికి కృషిచేస్తానని జిల్లా కలెక్టరు భరోసానిచ్చారు.

జిల్లాలో 17 మండలాల్లో 210 పనులకు ఆపరేషన్ & మెయింటెన్స్ రూ 11.62 కోట్లతో కాలువలు వదిలేలోపు పనులు పూర్తిచెయ్యాలి: జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి …

స్థానిక తహశీల్దారు ఛాంబర్లో మత్స్యశాఖ, పంచాయతీ రాజ్, వ్యవసాయ శాఖ, డ్వామా తదితర శాఖలతో జిల్లా కలెక్టరు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో 17 మండలాల్లో 210 పనులకు ఆపరేషన్ & మెయింటెన్స్ క్రింద రూ 11.62 కోట్లు నిధులతో కాలువల్లో తూడు, గుర్రపు డెక్కను, కాలువలు పూడికలు, డ్రైనేజీ పూడికలు, అవుట్ పాల్ స్లుయిజ్ పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలని అన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించి కాలువలు వదిలేలోపు పూర్తిచెయ్యాలని ఆదేశించారు. కైకలూరు నియోజకవర్గంలో ఆపరేషన్ & మెయింటెన్స్ రూ 3.50 కోట్లు నిధులతో పనులను ప్రణాళిక బద్ధంగా రైతులు మనోభావాలు అనుగుణంగా కాలువలు వదిలేలోపు పూర్తిచెయ్యాలని అన్నారు. శాఖలు వారీగా సమీక్షించి వారి పనులను సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఆర్డీవో ఐ.కిశోరు, జిల్లా పంచాయతీరాజ్ శాఖ యస్ఇ సి.హెచ్.దేవప్రకాష్, జిల్లా వ్యవసాయ శాఖ జెడి యస్.కె.హబీబ్ భాషా, డ్వామా పిడి కె.వెంకట సుబ్బారావు, జిల్లా మత్స్యశాఖ ఇన్చార్జి డిడి బి. రాజ్ కుమార్, డివిజన్, మండల వివిధ శాఖలు అధికారులు, ఏయంసి ఛైర్మన్ పెనుమత్స త్రినాధరాజు, చేపలు, రొయ్యలు సాగు రైతులు, తదితరులు పాల్గొన్నారు.