Close

జిల్లాలో అక్షర ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహణకు ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి అక్షర ఆంధ్ర కార్యక్రమం నిర్వహణపై అధికారులతో మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు

Publish Date : 26/05/2026

ఏలూరు, మే, 26 : జిల్లాలో అక్షర ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహణకు ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి అక్షర ఆంధ్ర కార్యక్రమం నిర్వహణపై అధికారులతో మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్బముగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో 96 వేల 836 మందిని అక్షర ఆంధ్ర కార్యక్రమంలో అభ్యాసకులుగా గుర్తించామన్నారు. వారి వివరాలకు అక్షర ఆంధ్ర యాప్ లో నమోదు చేసి అక్షరాస్యులుగా తీర్చిదిద్ధేందుకు చర్యలు తీసుకోవాలని, అందుకు అవసరమైన ప్రణాళిక, కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలన్నారు. గ్రామ సచివాలయ సిబ్బంది, డ్వాక్రా సభ్యులు ఇంటింటికి వెళ్లి అక్షర ఆంధ్ర కార్యక్రమం గురించి అవగాహన కలిపించాలని, నిరక్షరాస్యులుగా గుర్తించిన వారిని అక్షర ఆంధ్ర కార్యక్రమంలో నమోదు చేయించి జిల్లాలో అక్షరాస్యతా శాతాన్ని పెంచాలన్నారు.
వయోజన విద్యా శాఖ డిప్యూటీ డైరెక్టర్ ప్రభాకర్, డీఈఓ వెంకటలక్షమ్మ, డిఆర్డిఏ పీడీ, మెప్మా పీడీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.