Close

ఏలూరు జిల్లాలో 22ఏ భూ సమస్యల కింద అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల మేరకు పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ జి.జయలక్ష్మి కి తెలిపారు.

Publish Date : 26/05/2026

ఏలూరు, మే, 26 : ఏలూరు జిల్లాలో 22ఏ భూ సమస్యల కింద అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల మేరకు పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ జి.జయలక్ష్మి కి తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుండి 22ఏ భూ సమస్యల పరిష్కారం, రీ సర్వే, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ, రెవిన్యూ రికార్డుల డిజిటలైజేషన్, ఐవిఆర్ఎస్ సర్వే , తదితర అంశాలపై సిసిఎల్ఏ జయలక్ష్మి రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు, రెవిన్యూ అధికారులతో మంగళవారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సిసిఎల్ఏ జయలక్ష్మి మాట్లాడుతూ 22ఏ భూ సమస్యల పరిష్కారంలో నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన భూములకు సంబంధించి ఉన్న మార్గదర్శకాలను, కాలానుగుణంగా జారీచేసిన ప్రభుత్వ ఉత్తర్వులను క్షుణ్ణంగా పరిశీలించి అర్జీలను పరిష్కరించాలన్నారు. పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీకి సంబంధించి మే నెలలో నిర్దేశించిన మేర పంపిణీ చేయాలనీ, జూన్, నెలలో పంపిణీ చేయవలసిన పట్టాదార్ పాస్ పుస్తకాలకు సంబంధించి రైతుల వివరాలు, విస్తీర్ణం, తదితర అంశాలపై సమాచారం సిద్ధం చేసుకుని, పట్టాదార్ పాస్ పుస్తకాల ప్రచురణకు ముందు వివరాలను సరిచూసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో మే నెలలో 7701 పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ లక్ష్యానికి గాను, 7701 కు పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ చేసి నూరు శాతం లక్ష్యాలను సాధించామన్నారు. 22 ఏ భూ సమస్యలకు సంబంధించి 341 దరఖాస్తులు అందాయని వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి 75 దరఖాస్తులను ఆమోదించడం జరిగిందని, నిబంధనల మేరకు లేని 75 దరఖాస్తులను తిరస్కరించామని, 191 పెండింగ్ లో ఉన్నాయని, వాటిని క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల మేరకు ఉన్న ధరఖాస్తులను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.

జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, ఇంచార్జ్ డిఆర్ఓ దేవకీదేవి, నూజివీడు సబ్ కలెక్టర్, ఏలూరు, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ లు కిషోర్, రమణ, తహసీల్దార్లు, ప్రభృతులు పాల్గొన్నారు.