దెందులూరు నియోజకవర్గంలో పలు సమస్యలను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి దృష్టికి దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ తీసుకువచ్చారు .
Publish Date : 01/06/2026
ఏలూరు, జూన్, 1 : దెందులూరు నియోజకవర్గంలో పలు సమస్యలను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి దృష్టికి దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ తీసుకువచ్చారు . సోమవారం కలెక్టరేట్ లోని గోదావరి సమావేశపు హాలులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పిజిఆర్ఎస్) లో చింతమనేని ప్రభాకర్ జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ని కలిసి నియోజకవర్గంలో ఖరీఫ్ లో రైతులకు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని, త్రాగునీటి సమస్యలు, ఇతర సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చి పరిష్కారానికి చర్యలు తీసుకోవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా సదరు సమస్యలను పరిశీలించి నిబంధనల మేరకు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అక్కడికక్కడే అధికారులకు కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశాలు జారీ చేశారు.