Close

జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణానికి భూములు అందించిన రైతులకు పరిహారాన్ని వెంటనే అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు.

Publish Date : 03/06/2026

ఏలూరు, జూన్,3 : జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణానికి భూములు అందించిన రైతులకు పరిహారాన్ని వెంటనే అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జాతీయ రహదారి భూసేకరణ, నిర్మాణ పనుల ప్రగతిపై అధికారులతో జేసీ సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ అభిషేక్ గౌడ మాట్లాడుతూ జాతీయ రహదారి N.H.365BB జీలుగుమిల్లి నుండి పట్టిసీమ రహదారి పనులకు సంబంధించి రైతులకి చెల్లించవలసిన నష్ట పరిహారము మొత్తము విడుదల చేయవలసిందిగా జాతీయ రహదారి సంస్థ అధికారులను ఆదేశించారు. మరియు నష్ట పరిహారము పొందిన వారి నుండి భూమిని స్వాధీనము చేసుకొని రోడ్డు కాంట్రాక్టర్ వారికి అప్పగించవలసిందిగా సంబంధిత తహశిల్దార్ ను జేసీ ఆదేశించారు రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం చేసి, నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలన్నారు.

సమావేశంలో సంబంధిత మండలాల జాతీయ రహదారి సంస్థ అధికారులు, భూసేకరణ విభాగం అధికారులు, తహసీల్దార్లు, ప్రభృతులు పాల్గొన్నారు.