జిల్లాలో అటవీ వంటి ప్రాంతాల గుర్తింపు, డిజిటైజ్, జియో-రిఫరెన్స్ పనులు వేగవంతం చేసి నివేదికలు సమర్పించాలని పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.
ఏలూరు, జూన్, 3 : జిల్లాలో అటవీ వంటి ప్రాంతాల గుర్తింపు, డిజిటైజ్, జియో-రిఫరెన్స్ పనులు వేగవంతం చేసి నివేదికలు సమర్పించాలని పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో బుధవారం అటవీ భూములు మరియు అటవీ-వంటి ప్రాంతాలను గుర్తించి, డిజిటైజ్ చేసి, జియో-రిఫరెన్స్ పనుల ప్రగతిపై జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, జిల్లా అటవీశాఖాధికారి సందీప్ రెడ్డి తో కలిసి కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రభుత్వ రికార్డులలో అడవులుగా నమోదు చేయబడిన భూములు, గెజిట్ నోటిఫికేషన్లు, బ్లాక్ మ్యాప్‌లు మరియు KML లేయర్లను ఉపయోగించి అటవీ బ్లాక్‌ల డిజిటైజేషన్ మరియు జియో-రిఫరెన్సింగ్‌తో పాటు, క్షేత్రస్థాయి ధృవీకరణ చేయాలన్నారు. అదేవిధంగా జిల్లాలో జిల్లాలో నోటిఫైడ్ అడవులు అన్-నోటిఫైడ్ అడవులు, ఆక్రమణలు, RoFR ప్రాంతాలు, క్షీణించిన మరియు చెట్లు లేని భూములు, మరియు ప్రభుత్వ అలాగే ప్రైవేట్ తోటల పెంపకంపై డేటా సేకరణ చేయాలన్నారు. అటవీ భూములను గుర్తించి డిజిటైజ్ చేసే సమయంలో ఆర్.ఎస్.ఆర్., ఆడంగల్ , మ్యుటేషన్, క్షేత్రస్థాయిలో ప్రస్తుత పరిస్థితి లను పరిశీలించి, జియో-రిఫరెన్స్ పనులు వెంటనే పూర్తిచేయాలన్నారు.
సమావేశంలో ఇంచార్జ్ జిల్లా రెవిన్యూ అధికారి దేవకీదేవి, జిల్లా పరిషత్ సీఈఓ జగదాంబ, ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, వ్యవసాయ శాఖాధికారి హబీబ్ భాషా, సర్వే అధికారి అన్సారీ, అటవీ శాఖాధికారులు, ప్రభృతులు పాల్గొన్నారు.