రాష్ట్ర డెడికేటెడ్ కమీషన్ చైర్మన్ రాజీవ్ రంజాన్ మిశ్ర గురువారం ఏలూరు రాక బి.సి. రిజర్వేషన్ కోటాపై వినతుల స్వీకరణ
ఏలూరు,జూన్, 10 : రాష్ట్ర డెడికేటెడ్ కమీషన్ చైర్మన్, విశ్రాంత ఐ.ఏ.యస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్ర ఈనెల 11వ తేదీన ఏలూరులో పలు కార్యక్రమాలలో పాల్గొంటారని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఒక ప్రకటనలో తెలిపారు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వము ప్రత్యేకంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బి.సి రిజర్వేషన్ కోటాకు సంబంధించి వివిధ బిసి సంఘాలు, ప్రజా ప్రతినిధులు, ప్రజల నుంచి అభిప్రాయాలు, వినతులను స్వీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రాష్ట్ర డెడికేటెడ్ కమీషన్ చైర్మన్, విశ్రాంత ఐ.ఏ.యస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్ర ఈనెల 11 వతేదీ ఉదయం 10 గంటల నుండి ఏలూరు కలెక్టరేట్ లోని గోదావరి సమావేశపు హాలులో బిసి సంఘాలు, ప్రజాప్రతినిధులు, ప్రజల నుండి వినతులు స్వీకరిస్తారని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల బిసి సంఘాలు, ప్రజా ప్రతినిధులు మరియు సాధారణ ప్రజలతో సమావేశమై అభిప్రాయాలు, సూచనలు, వినతిపత్రాలు స్వీకరిస్తారని, కావున, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలలో బీసీ వర్గాలకు చెందిన సంఘాలు లేదా అవగాహన కలిగిన వ్యక్తులు స్థానిక సంస్థలకు సంబంధించిన రిజర్వేషన్లు మదింపుకు అవసరమయిన తమ అభిప్రాయాలు, సూచనలు వినతి పత్రముల రూపంలో సంబంధిత ఆధారాలతో డెడికేటెడ్ కమిషన్ ను కోరవచ్చని కలెక్టర్ తెలియజేసారు. .