మహిళాభివృద్ధి మరియు సంక్షేమ శాఖ, భారత ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో అమలుపరుస్తున్న కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మారిన బాలలందరికి ఆర్థిక భరోసా కల్పిస్తూ భవిష్యత్తు పైన ఆశలను పెంపొందించే విధంగా అమలు పరుస్తున్న ప్రధానమంత్రి కేర్ ఫర్ ఆర్ఫన్
ఏలూరు, జూన్, 10 : మహిళాభివృద్ధి మరియు సంక్షేమ శాఖ, భారత ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో అమలుపరుస్తున్న కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మారిన బాలలందరికి ఆర్థిక భరోసా కల్పిస్తూ భవిష్యత్తు పైన ఆశలను పెంపొందించే విధంగా అమలు పరుస్తున్న ప్రధానమంత్రి కేర్ ఫర్ ఆర్ఫన్ చిల్డ్రన్ పథకం ద్వారా 23 సంవత్సరంల వయస్సు పూర్తయిన తర్వాత లభించే 10 లక్షల రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ వేట్రీ సెల్వి చేతుల మీదుగా మంగళవారం 23 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా కి సంబంధించిన శ్రీమతి లేళ్ల శరత్ చంద్రిక అను ఆమెకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి చేతుల మీదుగా బుధవారం అందించడం జరిగింది. ఇంత మొత్తముగా వచ్చిన సొమ్మును జాగ్రత్తగా తన భవిష్యత్తు అవసరాలకు ఉపయోగించుకోవాలని అదేవిధంగా భవిష్యత్తులో ఉన్నత స్థితిలో స్థిరపడాలని దానికి కుటుంబ సభ్యుల సహకారంతో పాటు ప్రభుత్వం యంత్రాంగం కూడా అండగా ఉంటుందని తెలియజేసినారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారతాధికారి పి శారద , జిల్లా బాలల సంరక్షణ అధికారి సిహెచ్ సూర్యచక్ర వేణి, పిడి ఆఫీస్ నోడల్ ఆఫీసర్ తులసి , డిసిపియు సిబ్బంది శ్రీకాంత్ , మహేష్, సునీత, రాజు, పిడి ఆఫీస్ సిబ్బంది జెస్సీ తదితరులు పాల్గొన్నారు.