జిల్లాలో ప్రకృతి వైపరీత్యాల సమయంలో నష్ట నివారణకు సంబంధిత శాఖలకు సంబంధించి ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించినట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ కి తెలిపారు.
ఏలూరు, జూన్, 16 : జిల్లాలో ప్రకృతి వైపరీత్యాల సమయంలో నష్ట నివారణకు సంబంధిత శాఖలకు సంబంధించి ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించినట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ కి తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుండి రెవిన్యూ అంశాలు, సీజనల్ కండిషన్స్, 22ఏ భూ సమస్యల పరిష్కారం, రీ సర్వే, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ, తదితర అంశాలపై మంగళవారం రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ జి.జయలక్ష్మి తో కలిసి జిల్లా కలెక్టర్లు, రెవిన్యూ అధికారులతో సీఎస్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ సాయిప్రసాద్ మాట్లాడుతూ వర్షాకాలంలో వరదలు, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టం కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. జులై నెలలో పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ
ఏలూరు జిల్లాలో 22ఏ భూ సమస్యల కింద అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల మేరకు పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని , జులై నెలలో పంపిణీ చేయవలసిన పట్టాదార్ పాస్ పుస్తకాలకు సంబంధించి రైతుల వివరాలు, విస్తీర్ణం, తదితర అంశాలపై సమాచారం సిద్ధం చేసుకుని, వాటిని పరిశీలించి పట్టాదార్ పాస్ పుస్తకాల ప్రచురణకు చర్యలు తీసుకున్నామన్నారు.
జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, ఇంచార్జ్ డిఆర్ఓ దేవకీదేవి, నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న, ఏలూరు, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ లు లక్ష్మి ప్రసన్న, రమణ, తహసీల్దార్లు, ప్రభృతులు పాల్గొన్నారు.