పండుగ వాతావరణంలో జరిగిన రెండేళ్ల నమ్మకం.. అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధితో కలిసి పాల్గొన్న జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్
ఏలూరు, జూన్, 16 : రైతాంగ సంక్షేమమే కూటమి ప్రభుత్వ మొదటి ప్రాధాన్యతని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. స్థానిక ఇండోర్ స్టేడియం లో మంగళవారం రెండేళ్ల నమ్మకం.. అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధితో కలిసి జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతమనేని ప్రభాకర్, పత్సమట్ల ధర్మరాజు, డా. కామినేని శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి , ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్, ప్రభృతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ దేశానికీ వెన్నుముక ఐన రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతను ఇస్తున్నదన్నారు. విత్తనం నాటిన దగ్గరనుండి పండిన పంటకు గిట్టుబాటు దార కల్పించే వరకు రైతుకు అన్ని విధాలా తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. గత ప్రభుత్వం చివరిలో 4. 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని, 6. 30 లక్షల మంది రైతుల నుండి 9132 కోట్ల రూపాయల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయ సీజన్లో కూటమి ప్రభుత్వం 7. 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 10.27 లక్షల మంది రైతుల నుండి కొనుగోలు చేసి 17వేల 455 కోట్ల రూపాయలను రైతులకు చెల్లించామన్నారు. గత ప్రభుత్వం రైతులను మోసం చేసి 6 నెలలలకు పైగా బకాయిలు పెట్టిన ధాన్యం కొనుగోలు సొమ్ము 1674 కోట్ల రూపాయలను, నెల రోజుల్లోనే రైతుల ఖాతాలకు జమచేసి చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ప్రస్తుతం ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటలలోగా రైతుల ఖాతాలకు సొమ్మును జమచేస్తున్నామని మంత్రి చెప్పారు. జిల్లాలో ప్రధానమైన పంట వరి అని, ఆదాయం పెరగాలంటే మార్పు రావాలన్నారు. ఆయిల్ పామ్, కొబ్బరిలో కోకో అంతర పంటగా రైతులు వేస్తున్నారని, వాటి ద్వారా అధిక ఆదాయం సాగిస్తున్నారన్నారు. డ్రిప్ ఇరిగేషన్, సోలార్ పంప్ సెట్లు సిబ్సిడీపై అందిస్తున్నామన్నారు. జిల్లా జిడిపి వృద్ధి రేటులో వ్యవసాయ, అనుబంధ రంగాలు ద్వారా 8. 8 శాతం సాధించామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మన జిల్లా జిడిపి వృద్ధి రేటులో 5వ స్థానంలో ఉందని, 2027 నాటికి మూడవ స్థానానికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని, అయినప్పటికీ రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు ఎటువంటి కొరత లేకుండా చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో పెన్షన్లకు ఇప్పటివరకు 65 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశామని, రాష్ట్రంలో సంక్షేమ పధకాల అమలులో మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు.అన్ని వర్గాల సంక్షేమానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. జిల్లాలో 22ఏ కేసుల పరిష్కారంలో జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిందని, ఇంతవరకు 1800 రైతులకు చెందిన 1042 ఎకరాల భూములను వివాదాస్పద భూముల జాబితా నుండి తొలగించామన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా సమాన ప్రాధాన్యతను ఇస్తున్నామని, విశాఖలో నిర్వహించిన సిఐఐ సమ్మిట్ లో 14 లక్షల పెట్టుబాటులకు కృషి చేస్తామని, ఈ పరిశ్రమల ఏర్పాటుతో 10 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ఉపముఖ్యమంత్రి కృషితో రాష్ట్రంలోని పంచాయతీరాజ్ శాఖ దేశంలో 24 వ స్థానం నుండి మొదటి స్థానానికి చేరుకున్నదన్నారు. జిలాల్లో 240 కిలోమీటర్ల మేర కొత్తగా రోడ్లు నిర్మించామన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాను అన్నపూర్ణంగా అన్నదాతలు తీర్చిదిద్దారని, అన్నదాత అంటే అందరికీ భోజనం పెట్టేదాత అన్నారు. గత ప్రభుత్వం అన్నదాతకు రూ 16 వేలు బటన్ నొక్కి చేతులు దులుపుకున్నారని, కూటమి ప్రభుత్వంలో రూ 24 వేలు పెంచి రైతు అభివృద్ధి, సంక్షేమం కొరకు అహర్నిశలు కృషిచేస్తుందని అన్నారు. 2017 సంవత్సరం లో రూ 2,603 కోట్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు చింతలపూడి ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారని, గత ప్రభుత్వం ఆ ప్రాజెక్టును గాలికి వదిలేసారని అన్నారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే ఏలూరు, కృష్ణా జిల్లాకు త్రాగునీరు,సాగునీరు పుష్కలంగా ఉండేవి అని అన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు 70 శాతం పూర్తిచేస్తే, గత ప్రభుత్వం 10 శాతం కూడా పూర్తి చేయలేదని అన్నారు. వీళ్ళు నిర్వాహం వలన రూ 400 కోట్లు విలువచేసే డయాఫ్రమ్ వాల్ డామేజీ అయినను పట్టించు కోలేదని, కూటమి ప్రభుత్వం రాగానే ప్రపంచ నిపుణులను రప్పించి మరలా రూ 400 కోట్లు వెచ్చించి డయాఫ్రమ్ వాల్ ను నిర్మించామని అన్నారు. వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలకు ముందుగానే పోలవరం పూర్తి చేస్తామని అన్నారు. కూటమి ప్రభుత్వం గత రెండేళ్ల కాలంలో ప్రజా సంక్షేమం, సమగ్ర అభివృద్ధి లక్ష్యాలుతో అనేక కీలక కార్యక్రమాలను విజయ వంతంగా అమలు చేసిందని తెలిపారు. పేదలు, రైతులు, మహిళలు, యువత,వృద్ధులు మరియు బలహీనవర్గాలు సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిస్తూ పలు పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మౌళిక సదుపాయాలు అభివృద్ధి, గృహనిర్మాణం, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పన వంటి రంగాల్లో ప్రభుత్వం సాధించిన పురోగతి ప్రజలు జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకువచ్చిందని అన్నారు. ప్రజలు విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ పారదర్శక, జవాబుదారీ పాలనను అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. అభివృద్ధి ఫలాలు ప్రతి కుటుంబానికి చేరేలా రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తోందని, ప్రజలు సహకారంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.గత ప్రభుత్వం ఐదు ఏళ్ల అభివృద్ధి, సంక్షేమం పథకాలకు అయిన వ్యయం, కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అభివృద్ధి, సంక్షేమ వ్యయాన్ని అంకెలతో సహా ప్రతి గ్రామ పంచాయతీలలో డిస్ ప్లే చెయ్యాలని జిల్లా కలెక్టరు సూచించామని అన్నారు.
ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్రాలు ఒకే ప్రభుత్వాలు కంటిన్యూగా ఉంటే అభివృద్ధి, సంక్షేమం బ్రహ్మాండంగా జరుగుతాయని అన్నారు. కేంద్రంలో 12 ఏళ్లుగా ఒకే ప్రభుత్వం ఉండుట చేత ప్రపంచంలోనే మన భారతదేశం ఎన్నో ఘనవిజయాలు సాధించి మొదటి స్థానంలో ఉండేందుకు పోటీ పడుతుందని అన్నారు. 76 ఏళ్ళు వయస్సులో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ లో పర్యటిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పెట్టుబడులకు, పరిశ్రమలకు తీసుకురావడానికి మూడునెలలకు ఒక్కసారి విదేశాలకు వెళ్ళుతున్నారని అన్నారు. రెండేళ్లలో ప్రజలకు అందించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలు జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకు వచ్చాయని పేర్కొన్నారు. కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారానికి కృషిచేస్తున్నామని అన్నారు. పామాయిల్, కోకో, మామిడి, టుబాకో, తదితర పంటలకు రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా కృషి చేస్తామని అన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఫలితాలు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలు ప్రజలకు ప్రత్యక్షంగా అందుతున్నాయని, పారదర్శక పాలనతో ప్రజలు విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసిందని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం అనే ద్వంద్వ లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ప్రజలు ఆకాంక్షలకు అనుగుణంగా మిగిలిన అన్ని కార్యక్రమాలు చేపట్టి, పూర్తి చేస్తుందని వెల్లడించారు.
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో అన్ని వర్గాలకు సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నామన్నారు. తల్లికి వందనం పధకం కింద జిల్లాలో 390 కోట్ల రూపాయలు తల్లుల ఖాతాలకు జమ చేశామన్నారు. అన్న కేంటీన్ల ద్వారా 1. 27 లక్షల మందికి ఆహరం అందించామన్నారు. అన్నదాత సుఖీభవ పధకం ద్వారా జిల్లాలో 1.90 లక్షల మంది రైతులకు 225 కోట్ల రూపాయలను అందించామని, 2. 67 లక్షల మందికి పెన్షన్లుగా 3630 కోట్ల రూపాయలను అందించామన్నారు. పి4 కార్యక్రమం ద్వారా జిలాల్లో 15 వేల బంగారు కుటుంబాలను గుర్తించి, 4800 మార్గదర్సులను అనుసంధానం చేశామన్నారు. జిల్లాలో పేదలకు 12 వేల 500 గృహాలు నిర్మించామన్నారు. ఎన్నో దశాబ్దాలుగా విద్యుత్ సౌకర్యం లేని గిరిజన గ్రామాలలో సోలార్ ద్వారా విద్యుత్ సౌకర్యం అందించామన్నారు.
ఈ సందర్భంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య ( చంటి) మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అయిందని అన్నారు. రెండు ఏళ్ళు పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమం పథకాలు ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉందని, ఈ రోజున ఏలూరు జిల్లాలో విజయవంతంగా కార్యక్రమం జరిగిందని తెలిపారు. రెండేళ్ల పాలనలో ప్రజలు మనోభావాలకు అనుగుణంగా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నామని, అయినా కూడా ఇంకా చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయని దశలు వారీగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తామని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో విసిగిపోయి ప్రజా ప్రభుత్వానికి ప్రజలు పట్టడం కట్టారని, రెండేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాలు ప్రజలు అందరికీ తెలియ చెప్పాలని కోరారు.
కైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ దుర్మార్గపు పాలన నుండి ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలు దేవుళ్ళని అన్నారు. పోలవరం, రాజధాని అమరావతి నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వలన భూసమస్యలు అధికం అయ్యాయని 22 ఏ భూములకు ఏలూరు జిల్లాలో రెండు సార్లు పిజిఆర్ఎస్ ఇంచార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన నిర్వహించి ఎంతో మంది రైతులకు విముక్తి కలిగించాలని అన్నారు. కొల్లేరు సమస్యను శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఇందుకు 95 శాతం పనులు అయ్యాయని అన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు మాట్లాడుతూ గత రెండేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అన్ని వర్గాలోని ప్రజలు జీవితాల్లో విశేష మార్పులు తీసుకు వచ్చాయని తెలిపారు. నిరుపేదలు, రైతులు, మహిళలు, యువత, వృద్ధులతో సహా అన్ని వర్గాలు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రజలు అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూ, సంక్షేమ పథకాలు ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేస్తున్నామని వివరించారు. ప్రజలు విశ్వాసమే ప్రభుత్వానికి బలమని అదే నమ్మకంతో మరింత సమర్థవంతమైన పాలన అందిస్తున్నామని, ప్రజలు అంతా అండగా ఉండాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ, ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ రీజియన్ ఛైర్మన్ రెడ్డి అప్పల నాయుడు, ఏపి అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, ఏపీ ట్రైకార్ చైర్మన్ బోరగం శ్రీనివాసులు, ఉమ్మడి జిల్లా గ్రంథాలయ అధ్యక్షులు జుత్తిగ నాగరాజు, ఇంచార్జి రెవెన్యూ అధికారి ఎల్.దేవకీదేవి, ఆర్డీవో కె.లక్ష్మీప్రసన్న, ఏపీ ఎస్సీ మాల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టరు దాసరి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యేలు ఘంటా మురళీరామకృష్ణ, అంబికా కృష్ణ, మాజీ శాసన మండలి సభ్యులు కమ్మిలి విఠల్ రావు, ఏలూరు ఉడా చైర్మన్ పెద్దిబోయిన వాణి శివప్రసాదు, ఏఎంసీ చైర్మన్లు మామిళ్ళపల్లి పార్థసారథి, గారపాటి రామసీత, ఏలూరు బిజేపి అధ్యక్షులు సి.హెచ్.విక్రమ కిషోర్, ఉమ్మడి జిల్లా జనసేన అధ్యక్షులు కొటికలపూడి గోవిందరాజులు, వివిధ ఏఎంసి చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, వివిధ శాఖలు జిల్లా అధికారులు, రైతులు, మహిళలు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.