దివ్యాంగుని చెంతకు స్వయంగా వెళ్ళి అర్జీని స్వీకరించి, సమస్యలను అడిగి తెలుసుకుని భరోసానిచ్చిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ..
ఏలూరు, జూన్ 15: ప్రజా సమస్యలు పరిష్కార వేదికలో అందిన ప్రతి అర్జీని పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేటులోని గోదావరి సమావేశ మందిరంలో సోమవారం ప్రజాసమస్యలు పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా స్థాయీ అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు జిల్లా జాయింటు కలెక్టరు డా.యం.జె.అభిషేక్ గౌడ, ఇంచార్జి డిఆర్వో ఎల్.దేవకీదేవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టరు కె.భాస్కర్, ఆర్డీవో కె.లక్ష్మీప్రసన్న, ఎస్సీ కార్పొరేషన్ ఇడి యం.ముక్కంటి లు ప్రజలు నుండి అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో అధికారులు స్వీకరించిన ప్రతి అర్జీపై బాధ్యతాయుతంగా వ్యవహరించి, నిర్ణీత గడువు లోపుగా పరిష్కారం చూపాలని ఆదేశించారు. అర్జీలు నాణ్యత పరిష్కారంతో, పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే క్షేత్రస్థాయిలో వెళ్ళి లబ్ధిదారులుతో నేరుగా మాట్లాడి సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించాలని సూచించారు. ప్రతి సోమవారం పి.జి.ఆర్.ఎస్ మరియు రెవెన్యూ క్లినిక్‌లో అందిన అర్జీలుపై శాఖలు వారీగా అధికారులు సమీక్షలు నిర్వహించి, సమస్యలు పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ రోజు వచ్చిన అర్జీలలో కొన్ని.
ఏలూరు మండలం పోణంగి గ్రామానికి చెందిన తాడిశెట్టి వెంకన్న నాకు 74 ఏళ్లు వయస్సు వచ్చిందని, నాకు ఉన్న అరఎకరం పంట భూమితో బ్రతుకుచున్నాను మా పెద్ద అబ్బాయి పొలాన్ని దౌర్జన్యంగా ఆక్రమించుకున్నాడు అని నాకు బ్రతుకు తెరువు లేదని న్యాయం చెయ్యాలని కోరారు, చింతలపూడి మండలం రేచర్ల గ్రామానికి చెందిన అల్లం నర్సుల లక్ష్మి నా పంటభూమి ఆక్రమణకు గురైంది, నా భూమిని తిరిగి ఇప్పించి సర్వేచేసి సరిహద్దులు నిర్ణయించాలని కోరారు, ఏలూరు మండలం వెంకటాపురం గ్రామంకు చెందిన గొల్లపల్లి వెంకట రమణ నా చేపలచెరువు లీజుకు ఇచ్చాను అతను లీజు డబ్బులు ఇవ్వడం లేదు చెరువును స్వాధీనం చేయడం లేదని న్యాయం చెయ్యాలని కోరారు, కైకలూరు మండలం కైకలూరు మండలం నివాసి మారిశెట్టి లక్ష్మి మా ప్రాంతంలో రోడ్డులు ఆక్రమణలకు గురిఅయ్యాయని, డ్రైనేజీలు బ్లాక్ చేశారని విచారణ చేసి పరిష్కారం చూపాలని కోరారు, కైకలూరు మండలం కైకలూరు గ్రామంకు చెందిన కీర్తి వెంకట రామ్ ప్రసాదు కైకలూరు, కలిదిండి, ముదినేపల్లి ప్రధాన ప్రాంతాల్లో ప్రజలు రద్దీగా ఉండే చోట టాయిలెట్లు నిర్మాణాలు చేపట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వివిధ శాఖలు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.