ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) -2026లో భాగంగా జిల్లాలో ఇంతవరకు 8,72,755 (53.8%) ఎన్యూమరేషన్ ఫారంలు పంపిణి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు.
Publish Date : 21/06/2026
ఏలూరు, జూన్, 18 ; ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) -2026లో భాగంగా జిల్లాలో ఇంతవరకు 8,72,755 (53.8%) ఎన్యూమరేషన్ ఫారంలు పంపిణి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. వీటిలో 65,391 (3.98%) ఎన్యూమరేషన్ ఫారంలు డిజిటైజేషన్ చేశామన్నారు. ఈ ప్రక్రియ జూలై-14,2026వరకు కొనసాగుతుందని, ఈనెల 15వ తేదీ నుండి ప్రతి బూత్ లెవెల్ అధికారి , తమ పోలింగ్ కేంద్రం పరిధిలో ప్రతి ఇంటిని సందర్శించి గణన ఫారంను ఓటర్లకు అందజేస్తున్నారన్నారు. .ఓటర్లుగణన ఫారం యందు తమ వివరాలు నమోదు చేసి, తిరిగి బూత్ లెవెల్ అధికార్లకు ఓటర్లు గణన ఫారం అందచేస్తారని, తదుపరి బూత్ లెవెల్ అధికారి వాటిని పరిశీలించి,BLO-App యందు అప్ లోడ్ చెయ్యడం జరుగుతుందని కలెక్టర్ వెట్రిసెల్వి తెలియజేసారు..