Close

భారతీయ ఆధ్యాత్మిక కళ యోగా నేడు విశ్వవ్యాప్తంగా మన్ననలు పొందడం మన అందరికి గర్వకారణం. జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి …

Publish Date : 21/06/2026

ఏలూరు, జూన్ 21: స్థానిక వట్లూరు
టిటిడిసి కేంద్రంలో ఆదివారం అంతర్జాతీయ యోగాదినోత్సవం -2026 యోగాభ్యాసనలో కార్యక్రమంలో పాల్గొని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి యోగా ఆసనాలను వేశారు. జిల్లా కలెక్టరుతో పాటు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్, జిల్లా జాయింటు కలెక్టరు డా.యం.జె. అభిషేక్ గౌడ, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ రీజియన్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు లు పాల్గొన్నారు.

@ రాష్ట్రస్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు, సుప్రసిద్ధ భారతీయ యోగా గురువు శ్రీ రామ్ దేవ్ బాబా యోగా కార్యక్రమాన్ని, విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, అంతర్జాతీయ యోగ దినోత్సవ-2026 రాష్ట్ర స్థాయి వేడుకలను ప్రత్యక్ష ప్రసారాలను లైవ్ ద్వారా యోగా అభ్యాసకులు తిలకించారు.

@ జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాలను విజయవంతం చేసినందుకు జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ , జిల్లా ఇంచార్జి డిఆర్వో ఎల్.దేవకీదేవి, జిల్లా పరిషత్తు సిఇవో పి.జగదాంబ, ఆర్డీవో కె.లక్ష్మీప్రసన్న, జిల్లా పంచాయతీ శాఖ అధికారి జి. మల్లిఖార్జున రావు, డిఆర్డిఏ పిడి టి.వి. విజయలక్ష్మి, ఆయుష్ రీజనల్ డిడి డా.పి.కృష్ణవేణి లను, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) లు శాలువాలు కప్పి, ఘనంగా సన్మానించారు.

@ యోగాపై జిల్లా స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన, ఫోటో, క్విజ్, వీడియో, స్లోగన్లు, తదితర పోటీలలో గెలుపొంది, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన 23 మందికి ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను అందించి జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) లు ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆకాంక్ష, సూచనలు మేరకు గత 15 రోజులుగా జిల్లా వ్యాప్తంగా యోగా అభ్యసన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగిందని అన్నారు. భారతీయ ఆధ్యాత్మిక కళ యోగా నేడు విశ్వవ్యాప్తంగా మన్ననలు పొందడం మన అందరికి గర్వకారణం అన్నారు. యోగా మన ఆరోగ్యానికి గొప్ప దివ్యఔషధమని, ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి యోగా వేపు అడుగులు వెయ్యాలని. పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతున్నామని, నిరంతర కార్యక్రమంగా యోగాను చేసుకుంటూ, ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని అన్నారు. ఇప్పటివరకు నేర్చుకున్న యోగా అభ్యాసనలు నిలిపి వేయకుండా ప్రతిరోజు యోగాభ్యాసం చేసి సంపూర్ణ ఆరోగ్యం పొందాలన్నారు. విద్యార్థిని, విద్యార్థులు ప్రతిరోజు యోగా చెయ్యాలని, తద్వారా శారీరిక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, మేధస్సును కలిగి చదువుపై దృష్టి కేంద్రీకరించడానికి వీలు అవుతుందన్నారు. జిల్లా అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి కార్యక్రమాలను విజయవంతం చేసారని, ఇదే స్ఫూర్తితో రానున్న కాలంలో జరగబోయే కార్యక్రమాలను విజయవంతానికి సంసిద్ధులుగా కావాలని అన్నారు.

ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) మాట్లాడుతూ గత సంవత్సరం విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని గిన్నిస్ బుక్కు రికార్డును దక్కించు కోవడం మనందరికీ ఎంతో స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు. ఆరోగ్య వంతమైన భారతదేశం కోసం ప్రధాని, మన రాష్ట్ర ముఖ్యమంత్రి యోగాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ప్రపంచంలో ఏదేశంలో లేని యువత మన దేశంలో ఉన్నారని వారందరినీ ఆరోగ్యవంతులను చెయ్యడం ద్వారా ఆరోగ్య భారతదేశంగా తీర్చిదిద్దాలనేదే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష్యమని అన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరి దైనందిన జీవితంలో యోగా ఒక భాగం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు మేరకు జిల్లా అంతటా పండుగ వాతావరణంలో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించు కోవడం శుభ పరిణామం అన్నారు. దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందని, యోగాపై యువత దృష్టి పెట్టి యోగా ఆసనాలను వేసుకుంటే మేధస్సు పెరిగి, ఉన్నత చదువులు చదివి, ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని అన్నారు. ప్రతి ఒక్కరూ యోగా ఆసనాలను ప్రతిరోజు ఆచరిస్తూ, మరో ముగ్గురికి యోగా ఆసనాలు వేసుకునేలా ప్రోత్సహించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి పి.వి.సంధీప్ రెడ్డి, జిల్లా పరిషత్తు సిఇవో పి.జగదాంబ, ఇన్చార్జి డిఆర్వో యల్.దేవకీదేవి, ఆర్డీవో కె.లక్ష్మీప్రసన్న, ఆయుష్ రీజనల్ డిడి డా. పి.కృష్ణవేణి, ఏలూరు ఉడా చైర్మన్ పెద్దిబోయిన వాణి శివప్రసాదు, వివిధ శాఖలు జిల్లా, మండల అధికారులు, ఉద్యోగులు, మాస్టర్ ట్రైనర్స్, విద్యార్థిని, విద్యార్థులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.