మానవత్వాన్ని చాటుకున్న జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి
ఏలూరు, జూన్, 22 : కలెక్టరేట్ గోదావరి సమావేశపు హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ప్రజల నుండి వినతులను స్వీకరిస్తూ, వాటిని పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశిస్తూ బిజీ ఉన్న సమయంలో ఒక కదలలేని వృద్ధురాలు చేతిలో వినతి పత్రాన్ని చూసారు. అర్జీదారులు రద్దీ ఎక్కువగా ఉండడంతో తన వద్దకు వచ్చేందుకు ఇబ్బంది పడుతున్న ఆ వృద్ధురాలిని చూసిన వెంటనే స్టేజీ నుండి కలెక్టర్ హుటాహుటిన కిందకు వచ్చి ఆ వృద్ధురాలిని సమస్యను గురించి కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఉంగుటూరు మండలానికి చెందిన కొండేటి వెంకటలక్ష్మి తాను బీదరికంతో బాధపడుతున్నానని, తనకు రైస్ కార్డు మంజూరు చేయాలనీ, ట్రై సైకిల్ మంజూరు చేయాలనీ కోరారు. నిలువ నీడ లేదని, తనకు ఇల్లు మంజూరు చేయవలసిందిగా కలెక్టర్ ను కోరారు. దరఖాస్తు ను పరిశీలించి వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ స్థాయి వ్యక్తి స్వయంగా తన దగ్గరకు వచ్చి తన సమస్యను గురించి అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కారాన్ని చర్యలు తీసుకోవడం, కలెక్టర్ తన పట్ల చూపిన ఆప్యాయత, ఆదరాభిమానాలకు ఆ వృద్ధురాలు ఎంతో సంతోషానికి గురయ్యారు.