Close

ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) -2026లో భాగంగా జిల్లాలో ఇంతవరకు 15,79,042 (96.04%) ఎన్యూమరేషన్ ఫారంలు పంపిణి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు.

Publish Date : 26/06/2026

ఏలూరు, జూన్, 26: ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) -2026లో భాగంగా జిల్లాలో ఇంతవరకు 15,79,042 (96.04%) ఎన్యూమరేషన్ ఫారంలు పంపిణి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. వీటిలో 3 లక్షల 30 వేల 537 ( 20 %) ఎన్యూమరేషన్ ఫారంలు డిజిటైజేషన్ చేశామన్నారు. ఈ ప్రక్రియ జూలై-14, 2026వరకు కొనసాగుతుందని, ఈనెల 15వ తేదీ నుండి ప్రతి బూత్ లెవెల్ అధికారి , తమ పోలింగ్ కేంద్రం పరిధిలో ప్రతి ఇంటిని సందర్శించి గణన ఫారంను ఓటర్లకు అందజేస్తున్నారన్నారు. జిల్లాలో 16 లక్షల 44 వేల 194 మంది ఓటర్లు ఉన్నతారన్నారు. ఓటర్లు గణన ఫారం యందు తమ వివరాలు నమోదు చేసి, తిరిగి బూత్ లెవెల్ అధికార్లకు ఓటర్లు గణన ఫారం అందజేయాలని, తదుపరి బూత్ లెవెల్ అధికారి వాటిని పరిశీలించి, BLO-App యందు అప్ లోడ్ చెయ్యడం జరుగుతుందని కలెక్టర్ వెట్రిసెల్వి తెలియజేసారు..