Close

ఏలూరు జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కె. వెట్రిసెల్వి రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ కి తెలిపారు.

Publish Date : 25/06/2026

ఏలూరు, జూన్, 25 : ఏలూరు జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కె. వెట్రిసెల్వి రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ కి తెలిపారు. ఈనెల 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు రాష్ట్రంలో పల్స్ పోలియో నిర్వహణ ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయం నుండి ప్రిన్సిపాల్ కార్యదర్శి సురేష్ కుమార్ రాష్ట్రంలోని కలెక్టర్లతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఏలూరు కలెక్టరేట్ నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో లక్షా 80 వేల 575 మంది 5 సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలు ఉన్నారని గుర్తించామని, వీరి కోసం 2 లక్షల 52 వేల డోసులు సిద్ధం చేశామన్నారు. ఈనెల 28వ తేదీన 1094 బూత్ ల ద్వారా 5 సంవత్సరాలలోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించడం జరుగుతుందన్నారు. 29, 30 తేదీలలో ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేయని పిల్లలను గుర్తించి వేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.