Close

ఏలూరు జిల్లాలో యోగాంధ్ర శిక్షణ కార్యక్రమాల విజయవంతంగా నిర్వహించినందుకు గాను లో రాష్ట్ర స్థాయి గోల్డ్ మెడల్ సాధించిన సిహెచ్.శివ ను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అభినందించారు.

Publish Date : 06/07/2026

ఏలూరు, జూలై , 6 : ఏలూరు జిల్లాలో యోగాంధ్ర శిక్షణ కార్యక్రమాల విజయవంతంగా నిర్వహించినందుకు గాను లో రాష్ట్ర స్థాయి గోల్డ్ మెడల్ సాధించిన సిహెచ్.శివ ను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అభినందించారు. రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చిన సందర్భంగా స్థానిక కలెక్టరేట్ లో సోమవారం జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ని శివ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో అంతర్జాతీయ యోగ దినోత్సవము సందర్భంగా నెలరోజులపాటు నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ద్వారకా తిరుమల, పట్టిసీమ, జిల్లా స్థాయిలో పెద్దఎత్తున నిర్వహించిన యోగా శిక్షణా కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహించడంతోపాటు, ప్రతీ రోజు యోగా శిక్షణ అందించారని, ప్రజలకు, విద్యార్థులకు చక్కని శిక్షణ అందించిన శివ సేవలు మరువలేనివన్నారు. శివ ప్రతిభను గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ స్వీకరించిన శివ ను కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు.