ఎన్యూమరేషన్ ఫారంలు డిజిటైజేషన్ మంగళవారం నాటికి 75 శాతం పూర్తి కావాలి అధికారులతో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష
ఏలూరు, జూలై , 6 : పిజిఆర్ఎస్ ధరఖాస్తుల పరిష్కారంలో అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో అర్జీదారుని కలిసి వారి సమస్యను తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి సోమవారం పిజిఆర్ఎస్ ధరఖాస్తుల పరిష్కారం, ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR), 22ఏ కేసుల పరిష్కారం, తదితర అంశాలపై అధికారులతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ పిజిఆర్ఎస్ ధరఖాస్తుల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యాన్ని ప్రదర్శించవద్దన్నారు. కొంతమంది అధికారులు కింద స్థాయి సిబ్బంది అర్జీదారుని దగ్గరకు పంపిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. సంబంధిత శాఖల అధికారులు అర్జీదారుని వద్దకు వెళ్లి వారితో మర్యాదగా మాట్లాడి వారి సమస్యను తెలుసుకుని, క్షేత్రస్థాయిలో పరిశీలించి సానుకూల దృక్పధంతో నిర్దేశించిన సమయంలోగా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. పిజిఆర్ఎస్ ధరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించినట్లు అర్జీదారులు నుండి ఫిర్యాదు వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. పిజిఆర్ఎస్ ధరఖాస్తుల పరిష్కారంలో ప్రజలు సంతృప్తి స్థాయిలో వెనుకబడి ఉన్న ముసునూరు, జంగారెడ్డిగూడెం, పెదవేగి తహసీల్దార్లు తమ పనితీరుని మెరుగుపరచుకోవాలని కలెక్టర్ హెచ్చరించారు. ఎన్యూమరేషన్ ఫారంలు డిజిటైజేషన్ పనులలో ఎన్యూమరేషన్ ఫారంలు డిజిటైజేషన్ ప్రక్రియ మంగళవారం నాటికి 75 శాతం పూర్తి కావాలని కలెక్టర్ ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లను కలెక్టర్ ఆదేశించారు. 22ఏ భూ సమస్యల పరిష్కారంపై క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, ఇంచార్జ్ డిఆర్ఓ దేవకీదేవి, నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న, ఆర్డీఓ లు లక్ష్మీప్రసన్న, రమణ, ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఏ . భానుప్రతాప్, స్వర్ణ గ్రామ/వార్డ్ సచివాలయాలు ప్రత్యేక అధికారి నాయుడు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఈఆర్ఓ లు, ఏఈఆర్ఓ లు, తహసీల్దార్లు, ఎంపిడిఓలు, బిఎల్ఓ లు, ప్రభృతులు పాల్గొన్నారు.