క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అపరమిత అవకాశాలు కల్పిస్తున్నది, క్రీడలకు యువత ప్రాధాన్యత ఇవ్వాలి. అమరావతి ఛాంపియన్‌షిప్ –2026 గోడపత్రికలను ఆవిష్కరించిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ..
ఏలూరు, జూలై 06, జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశమందిరంలో సోమవారం అమరావతి ఛాంపియన్‌షిప్–2026 – ఒకే స్ఫూర్తి, ఒకే ఛాంపియన్‌షిప్, అపరిమితమైన అవకాశాలు అనే అంశాలతో ముద్రించిన గోడ పత్రికలను జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ఆవిష్కరించారు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని యువత తమ క్రీడాప్రతిభను చాటుకునేందుకు అమరావతి ఛాంపియన్‌షిప్ -2026 ఒక చక్కని వేదికగా నిలుస్తుందని అన్నారు. క్రీడలు ద్వారా శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ, జట్టు భావన పెంపొందుతాయని పేర్కొన్నారు. జిల్లాలోని అర్హులైన క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
అమరావతి ఛాంపియన్‌షిప్ – 2026 ను విజయవంతం చేసేందుకు సంబంధిత శాఖలు అధికారులు సమన్వయంతో పనిచేయాలని, పోటీలు నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చెయ్యాలని సూచించారు. ఛాంపియన్‌షిప్-2026 పోటీలు వివరాలు వయో పరిమితి విభాగాలు 17 సంవత్సరాలు లోపు బాలురు & బాలికలు, 23 సంవత్సరాలు లోపు యువకులు & యువతులు పాల్గొనవచ్చన్నారు. విలువిద్య, అథ్లెటిక్స్, బాక్సింగ్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, చెస్, హాకీ, కబడ్డీ, ఖో-ఖో,వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, యోగా మొత్తం 12 రకాలు పోటీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. నియోజకవర్గ స్థాయీ ఎంపికలు, పోటీలు జూలై 15 నుండి 25 వరకు, జిల్లా స్థాయి పోటీలు మరియు ఎంపికలు జూలై 26 నుండి ఆగస్టు 10 వరకు, రాష్ట్ర స్థాయిపోటీలు ఆగస్టు 21 నుండి 26 వరకు జరుగుతాయని తెలిపారు. నగదు బహుమతులు మొత్తం విలువ రూ 91.90 లక్షలు రూపాయలు బహుమతులు ప్రదానోత్సవం ఆగస్టు 29 తేదీ జాతీయ క్రీడాదినోత్సవం రోజున (వేదిక నిర్ణయించవలసి ఉంది) అందజేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ, అసిస్టెంటు కలెక్టరు సి.హెచ్.శ్రావణ్ కుమార్ రెడ్డి, ఆర్డీవో కె.ప్రసన్నలక్ష్మి, జిల్లా స్పోర్ట్స్ అభివృద్ధి అధికారి సయ్యద్ అబ్దుల్ అజీజ్, విద్యాశాఖ సహాయ సంచాలకులు ఏ.డి. వెంకటఅప్పయ్య, తదితరులు పాల్గొన్నారు.