Close

ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) -2026లో భాగంగా జిల్లాలో ఇంతవరకు 11 లక్షల 24 వేల 848( 68.41%) ఎన్యూమరేషన్ ఫారంలు డిజిటైజేషన్ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు.

Publish Date : 05/07/2026

ఏలూరు, జూలై , 5 : ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) -2026లో భాగంగా జిల్లాలో ఇంతవరకు 11 లక్షల 24 వేల 848( 68.41%) ఎన్యూమరేషన్ ఫారంలు డిజిటైజేషన్ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. జిల్లాలో 16 లక్షల 44 వేల 194 మంది ఓటర్లు ఉన్నరని, వారిలో 16 లక్షల 39వేల 426 (99.71%) ఎన్యూమరేషన్ ఫారంలు పంపిణి చేయడం జరిగిందన్నారు. ఈ ప్రక్రియ జూలై-14, 2026వరకు కొనసాగుతుందన్నారు. జిల్లాలో 1744 మంది బిఎల్ ఓ లు ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) -2026 కార్యక్రమంలో విధులు నిర్వర్తిస్తున్నారన్నారు . ఓటర్లు గణన ఫారం యందు తమ వివరాలు నమోదు చేసి, తిరిగి బూత్ లెవెల్ అధికార్లకు ఓటర్లు గణన ఫారం అందజేయాలన్నారు. తదుపరి బూత్ లెవెల్ అధికారి వాటిని పరిశీలించి, BLO-App యందు అప్ లోడ్ చెయ్యడం జరుగుతుందని ప్రజలు తమకు అందిన ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తిచేసి, బిఎల్ఓ లకు అందించి నిర్దేశించిన సమయంలోగా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) -2026 కార్యక్రమం పూర్తి అయ్యేందుకు సహకరించాలని కలెక్టర్ వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు.