పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు అందించే ఇళ్ల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలనీ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో శనివారం పోలవరం ప్రాజెక్ట్ ఆర్ అండ్ ఆర్ భూసేకరణ, ఇ
ఏలూరు, జూలై , 4 : పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు అందించే ఇళ్ల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలనీ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో శనివారం పోలవరం ప్రాజెక్ట్ ఆర్ అండ్ ఆర్ భూసేకరణ, ఇళ్ల నిర్మాణం, జాతీయ రహదారి, తదితర ప్రోజెక్టుల భూసేకరణ, నిర్మాణ పనుల ప్రగతిపై అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా జేసీ సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ అభిషేక్ గౌడ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు నిర్మించే ఇళ్ల కాలనీలను త్వరితగతిన పూర్తిచేయాలని, కాలనీలో త్రాగునీరు, రోడ్లు, విద్యుత్, వంటి ప్రాధమిక మౌలిక సదుపాయాలు వెంటనే పూర్తి చేయాలన్నారు. కాలనీల నిర్మాణానికి సేకరించవలసిన భూసేకరణను వెంటనే పూర్తిచేయాలన్నారు. జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణానికి భూములు అందించిన రైతులకు పరిహారాన్ని వెంటనే అందించాలన్నారు. సిఆర్డిఏ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి నూజివీడు నియోజకవర్గంలో భూసేకరణ పనులపై జేసీ సమీక్షించారు.
సమావేశంలో పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ అభిషేక్, ఇంచార్జ్ డిఆర్ఓ దేవకీదేవి, నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న, సంబంధిత మండలాల జాతీయ రహదారి సంస్థ అధికారులు, భూసేకరణ విభాగం అధికారులు, తహసీల్దార్లు, ప్రభృతులు పాల్గొన్నారు.