Close

దేశ స్వాతంత్రం కోసం తన ప్రాణాలను అర్పించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నేటి యువతకు ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక కలెక్టరేట్ లో శనివారం అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు నిర్వహించారు.

Publish Date : 04/07/2026

ఏలూరు, జూలై , 4 : దేశ స్వాతంత్రం కోసం తన ప్రాణాలను అర్పించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నేటి యువతకు ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక కలెక్టరేట్ లో శనివారం అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి కలెక్టర్ వెట్రిసెల్వి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ చిన్న వయస్సు నుండే దేశభక్తిని నింపుకుని దేశ స్వాతంత్రం కోసం, మన్యం ప్రజల హక్కుల కోసం బ్రిటిష్ వారిని ఎదిరించిన మహా వీరుడు అల్లూరి సీతారామరాజు అని, ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శనీయమన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన త్యాగం, ధైర్యం, నాయకత్వం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. అల్లూరి సీతారామరాజు ఆశయాలకు అనుగుణంగా నేటి యువత నడిచి దేశాభివృద్ధికి కృషి చేయాలన్నారు.

కార్యక్రమంలో కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.