Close

దేశ స్వాతంత్ర్య సమరంలో అల్లూరి చేసిన త్యాగాలు స్ఫూర్తిదాయకం. అసిస్టెంటు కలెక్టరు సి.హెచ్.శ్రావణ్ కుమార్ రెడ్డి .

Publish Date : 04/07/2026

ఏలూరు, జూలై 04: జిల్లా కలెక్టరేటు ప్రాంగణంలో శనివారం విప్లవ వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి, అసిస్టెంటు కలెక్టరు సి.హెచ్.శ్రావణ్ కుమార్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా అసిస్టెంటు కలెక్టరు సి.హెచ్.శ్రావణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేశస్వాతంత్ర్య సమరంలో అల్లూరి చేసిన త్యాగాలు, గిరిజనులు హక్కులు కోసం చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. దేశ స్వాతంత్ర్య సమరంలో చూపిన అసమాన ధైర్యసాహసాలు, త్యాగనిరతి భావం భావితరాలకు స్ఫూర్తి దాయకమని అన్నారు. దేశం కోసం ఆయన చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషిచెయ్యాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఇంచార్చి జిల్లా రెవిన్యూ అధికారి యల్.దేవకీదేవి, జిల్లా టూరిజం మేనేజరు యస్.పట్టాభిరామన్న, జిల్లా కలెక్టరేటు అధికారులు, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.