Close

దివ్యాంగులు చెంతకు స్వయంగా వెళ్ళి సమస్యలను అడిగి తెలుసుకుని భరోసానిచ్చిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి .

Publish Date : 03/07/2026

ఏలూరు/దెందులూరు, జూలై 03: దెందులూరు యంపిడివో కార్యాలయం శుక్రవారం మొదటి విడత “ఒక నెల -ఒక నియోజక వర్గం – నాలుగు పర్యటనలు” కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులు చెంతకు స్వయంగా వెళ్ళి సమస్యలను అడిగి తెలుసుకుని అర్జీలను స్వీకరించారు. దెందులూరు మండలం కొవ్వలి గ్రామానికి చెందిన నర్సు మణికంఠ, జామి సాయికుమార్ లు దివ్యాంగులు పింఛను సొమ్మును అర్హతను బట్టి పెంచాలని కోరగా, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి సానుకూలంగా స్పందించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ దివ్యాంగులు పిజిఆర్ఎస్ వచ్చినప్పుడు వారిదగ్గరకే స్వయంగా వెళ్ళి, వారిని చిరునవ్వుతో పలకరించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పెన్షన్లు, సహాయక పరికరాలు అవసరాలు అడిగి తెలుసుకుని, మనకు అవకాశం ఉన్నవి తక్షణం మంజూరు చెయ్యాలని అధికారులకు ఆదేశించారు. దివ్యాంగులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను సానుభూతితో అర్థంచేసుకుని సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి దివ్యాంగుడికి చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దివ్యాంగులు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, సమస్యలు పరిష్కారానికి జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ, ఆర్డీవో కె.లక్ష్మీప్రసన్న, డిఆర్డిఏ పిడి టి.వి.వరలక్ష్మి, తదితర అధికారులు ఉన్నారు.