Close

ఏలూరు జిల్లాలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) -2026 కార్యక్రమంలో 16 లక్షల 35 వేల 754 ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర చీఫ్ ఎలెక్టోరల్ అధికారి వివేక్ యాదవ్ కి తెలిపారు.

Publish Date : 02/07/2026

ఏలూరు, జూలై , 2 : ఏలూరు జిల్లాలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) -2026 కార్యక్రమంలో 16 లక్షల 35 వేల 754 ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర చీఫ్ ఎలెక్టోరల్ అధికారి వివేక్ యాదవ్ కి తెలిపారు. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) -2026 కార్యక్రమం ప్రగతిపై రాష్ట్ర సచివాలయం నుండి సిఈఓ వివేక్ యాదవ్ జిల్లా కలెక్టర్లతో గురువారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా వివేక్ యాదవ్ మాట్లాడుతూ ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) -2026 నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేయాలన్నారు. ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ తక్కువగా ఉన్న పోలింగ్ స్టేషన్ లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి డిజిటలైజేషన్ పనులు పురోగతిలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఏలూరు జిల్లా కలెక్టరేట్ నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) -2026 కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాలు 99. 49 శాతం 16 లక్షల 35 వేల 754 పంపిణీ చేశామని, 8 లక్షలు 3 వేల 166 ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తి చేశామన్నారు. డిజిటలైజేషన్ తక్కువగా ఉన్న పోలింగ్ స్టేషన్ లపై ప్రత్యేక దృష్టి సారించి డిజిటలైజేషన్ పనులు పురోగతి సాధిస్తామని కలెక్టర్ వెట్రిసెల్వి సీఈఓ వివేక్ యాదవ్ కు తెలియజేసారు.